ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ హీట్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది.. ముఖ్యంగా ప్రధాన పార్టీల అధినేతలు కూడా విమర్శలతో పొలిటికల్ హీట్ ని పెంచేస్తూ ఉన్నారు. ఇటు వైయస్ జగన్ అటు చంద్రబాబు ఇద్దరూ కూడా ఒకరి పైన మరొకరు విమర్శలు చేస్తూ పలు రకాల ఆరోపణలు చేస్తూ సరికొత్త చర్చలకు తావు ఇచ్చేలా కనిపిస్తోంది. ఎన్నికల తర్వాత చంద్రబాబు జైలుకు వెళ్తారని మిగిలిన జీవితమంతా ఆయన జైలులోనే గడపవలసి ఉంటుందంటూ వైసీపీ నేతలు ఇప్పటికే ఎన్నోసార్లు విమర్శించడం జరిగింది.


అటు టిడిపి శ్రేణులు కూడా ఇదే విషయాన్ని ఎన్నికలు పూర్తయిన తర్వాత జగన్ మరొకసారి జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలంటూ కూడా ఎద్దేవ చేస్తున్నారు.. ఇలా ఒకరి పైన ఒకరు జైలు అంశాన్ని తెరపైకి తీసుకువస్తూనే ఉన్నారు.. 2014 తర్వాత చంద్రబాబు పాలనలో అవినీతి జరిగిందని వైసిపి సర్కార్ విచారణ జరిపించింది . ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ , అమరావతి రింగ్ రోడ్డులో, ఫైబర్ గ్రిడ్ స్కామ్ అంటూ ఇలా ఎన్నో రకాలైన తెరమీదకి తీసుకువచ్చింది. దీంతో బాబు 50 రోజులకు పైగా జైలు జీవితాన్ని గడిపారు..


ఆ తర్వాత బెయిల్ మీద బయటికి రావడంతో ఈ అంశం కాస్త తగ్గిపోయింది.. దీంతో మరొకసారి వైసిపి గెలిస్తే బాబు పైన ఉన్న కేసులు అన్నీ కూడా మరొకసారి బయటికి వస్తాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.. ఒకవేళ కూటమి గెలిస్తే ఖచ్చితంగా జగన్ ను జైలుకు పంపించే విధంగా చంద్రబాబు అడుగులు వేస్తారనే విషయం వినిపిస్తోంది. ఇసుక కుంభకోణం, మద్యం కుంభకోణం వంటి వాటిలో టిడిపి పలు రకాల ప్రశ్నలను వేస్తోంది. దీంతో ఈ విషయం పైన చంద్రబాబు ఇప్పటికి ఎన్నోసార్లు తెలియజేశారు. ఇలా ఇద్దరు నేతలు కూడా ఒకరి పైన మరొకరు జైలు దిశగా ప్రణాళికలు రచిస్తూ ఉండడంతో ఎన్నికల తర్వాత ఎవరు జైలుకు వెళ్తారు అనే విషయం గట్టిగా వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: