2019లో నెల్లూరు జిల్లాని క్లీన్ స్వీప్ చేసిన వైసీపీకి ఈ దఫా తొలి ఓటమిని ఉదయగిరి నియోజకవర్గం పరిచయం చేయబోతోంది. రాజకీయంగా జిల్లాని గుప్పెట్లో పెట్టుకున్న మేకపాటి కుటుంబానికి ఎన్నారై కాకర్ల సురేష్ షాకివ్వబోతున్నారు. ఇంతకీ ఉదయగిరిలో టీడీపీకి ఉన్న బలమేంటి..? వైసీపీకి ఉన్న బలహీనతలేంటి..?


రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీవైపు వచ్చిన నియోజకవర్గాల్లో ఉదయగిరి కూడా ఒకటి. జగన్ తో విభేదించిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరారు. అయితే ఆయనకు చంద్రబాబు టికెట్ హామీ ఇవ్వలేదు. స్థానికంగా అప్పటికే కాకర్ల సురేష్ టీడీపీ తరపున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తాజా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు సహా మరికొందరు పోటీలో ఉన్నా కూడా చంద్రబాబు మాత్రం యువకుడైన కాకర్లకే ఉదయగిరి అభ్యర్థిగా అవకాశమిచ్చారు.


మొదట్లో సీనియర్లు కాస్త అలిగినా కాకర్ల అన్ని గ్రూపులను ఏకం చేశారు. ఇప్పుడు అంతా ఏకతాటిపైకి వచ్చి కాకర్ల వెంట నడుస్తున్నారు. యువకుడు, ఉత్సాహవంతుడు, రాజకీయాల్లోకి రాకముందే సేవా కార్యక్రమాలతో నియోజకవర్గంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న కాకర్ల సురేష్ టీడీపీ తరపున బలమైన అభ్యర్థిగా ఉన్నారు. టీడీపీ సాంప్రదాయ ఓటు బ్యాంకు ఆయన వైపే ఉంది. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అభిమానులు, ఆయన అనుచరులు కూడా టీడీపీకి జై కొట్టారు. ముఖ్యంగా యువత, అందులోనూ ఇటీవలే ఓటు నమోదు చేసుకుని తొలిఓటు వేయడానికి రెడీగా ఉన్నవారంతా జై కాకర్ల అంటున్నారు.


మై ఫస్ట్ ఓట్ ఫర్ సీబీఎన్ అంటూ వారంతా ముందుకొచ్చారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ ఈసారి దాదాపుగా కొత్తవారితో ప్రయోగం చేస్తోంది. ఉదయగిరితోపాటు, కావలి, కోవూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి.. ఇలా సగం స్థానాల్లో కొత్తవారే పోటీ చేస్తున్నారు. వీరిలో కాకర్ల విజయం గ్యారెంటీ అని ఈపాటికే తేలిపోయింది.


కాకర్లకు బలహీన ప్రత్యర్థి..
వైసీపీ నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఇక్కడ కాకర్లకు ప్రత్యర్థిగా బరిలో దిగుతున్నారు. మేకపాటి వారసత్వం ఉన్నా కూడా.. ఆయనకు ఇదే తొలి ఎన్నిక. ఇప్పటి వరకూ వ్యాపారాలకే పరిమితం అయిన రాజగోపాల్ రెడ్డి అనివార్య కారణాల వల్ల రాజకీయాల్లోకి వచ్చారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలోనే ఆయన సంగతేంటో తేలిపోయింది. తమ్ముడు విజయం కోసం మేకపాటి రాజమోహన్ రెడ్డి తెరపైకి రావాల్సి వచ్చింది. తమ్ముడి తరపున ఆయన ప్రచార కార్యక్రమాల్లో రాజమోహన్ రెడ్డి చెమటోడుస్తున్నారు.


ప్రస్తుత పరిస్థితి చూస్తే ఉదయగిరిలో కాకర్ల విజయం ఖాయంగా కనపడుతోంది. మేకపాటి రాజగోపాల్ రెడ్డి బలహీన అభ్యర్థిగా తేలిపోయారు. కనీసం నియోజకవర్గంలోని అన్ని మండలాలకు ఆయన వెళ్లలేకపోతున్నారు. మరోవైపు కాకర్ల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నేరుగా గ్రామాలకు వెళ్లడంతోపాటు, సోషల్ మీడియాలో కాకర్ల టీమ్ బలంగా ఉంది. బీజేపీ, జనసేన ఓటు బ్యాంక్ కూడా ఉదయగిరిలో కాకర్లకు అదనపు బలంగా మారింది. మొత్తమ్మీద 2024లో ఉదయగిరిలో కాకర్ల సురేష్ టీడీపీ జెండా ఎగరేయబోతున్నారని తేలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: