- జ‌న‌సేనేత‌ర నాయ‌కుల‌కే 12 టిక్కెట్లు
- బీసీ నేత పోతిన మ‌హేష్ లాంటోళ్ల‌కు తీవ్ర అన్యాయం
- జ‌న‌సేన‌లో అప్ర‌క‌టిత నియంతృత్వంపై నేత‌ల గగ్గోలు


( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
రాజ‌కీయ‌ల్లో సంతృప్తులు.. అసంతృప్తులు కామ‌న్‌. అయితే.. వీరిని స‌రైన విధంగా న‌డిపించ‌డం.. వారిని హ్యాండిల్ చేయ‌డం అనేది కీల‌కం. గతంలోనే చెప్పుకొన్న‌ట్టు.. ప‌ట్టువిడుపులు లేని రాజకీయం.. నాయ‌కు లు కూడా ఎక్క‌డా రాణించిన‌ట్టు లేదు. టికెట్లు ద‌క్కుతాయా?  ఇస్తారా?  ఇవ్వారా? అనేది ఇప్పుడు స‌బ్జెక్టు కాదు. కానీ, టికెట్ ఇచ్చినా.. ఇవ్వ‌క‌పోయినా.. నాయ‌కులు ఒకింత స్వాంత‌న కోరుకుంటాడు. 99 మార్కులు వ‌చ్చిన వాడు.. పొగ‌డ్త‌ల‌కు ఆశ‌ప‌డ్డ‌ట్టే.. సున్నా మార్కులు వ‌చ్చిన వాడు ఓదార్పును కోరుకుంటాడు.


ఇదే.. ఇప్పుడు జ‌న‌సేన‌కు శాపంగా మారింది. పార్టీలో అప్ర‌క‌టిత నియంతృత్వం సాగుతోంద‌న్న వాద‌న మ‌రో సారి పోతిన మ‌హేష్ వంటి బ‌ల‌మైన బీసీ నాయ‌కుడి(నిజ‌మే.. ఆయ‌న బ‌ల‌ప‌డ్డారు. ఇది ఒక‌ప్ప‌టి ప‌వ‌న్ మాటే) నోటి నుంచే ఈ మాట రావ‌డం.. కొత్త కాదు.. గ‌తంలోనూ ఇద్ద‌రి నుంచి ముగ్గురు వ‌ర‌కు ఇదే మాట చెప్పారు. దీనికి కార‌ణం.. టికెట్ ఇవ్వ‌లేక‌పోతే.. క‌నీసం వారిని పిలిచి బుజ్జ‌గించే ప‌రిస్థితి అయినా ప‌వ‌న్ తీసుకురావాలి. పోనీ.. త‌న‌కు కుద‌ర‌క‌పోతే.. నాగ‌బాబు, నాదెండ్ల వంటి వారి ద్వారా అయినా చేయించాలి.


కానీ, ఈ విష‌యంలో ప‌వ‌న్ అహంకార పూరితంగా వ్య‌వ‌హ‌రించార‌ని పార్టీలోనే చ‌ర్చ‌సాగుతోంది. ఇదే చివ‌ర‌కు ఆయ‌న‌కు శ‌త్రువుగా మారుతోంది. బ‌హిర్గ‌త శత్రువుల క‌న్నా.. కూడా అంత‌ర్గ‌త శ‌త్రువుల‌తోనే ఎదుగుతున్న పార్టీల‌కు ప్ర‌మాదం ఎక్కువ. ఇదే జ‌న‌సేన‌లో బ‌ల‌ప‌డుతోంది. తిరుపతి నుంచి అనకాప‌ల్లి వ‌ర‌కు.. భీమ‌వ‌రం నుంచి విశాఖ వ‌రకు.. సుమారు 11 స్థానాల‌ను జ‌న‌సేన యేత‌ర పార్టీల అభ్య‌ర్థుల‌కు టికెట్లు ఇవ్వ‌డం.. రెండు ఎంపీస్తానాల్లో ఒక‌టి వైసీపీ నాయ‌కుడి(రాజీనామా చేసి వ‌చ్చారు) ఇవ్వ‌డం ద్వారా.. ప‌వ‌న్ త‌న చేతుల‌తో త‌నే త‌ప్పులు చేసుకున్నారు.


కీల‌క‌మైన ఎన్నిక‌ల‌కు ముందు పోతిన వంటి వ్య‌క్తి మీడియా ముందుకు వ‌చ్చి.. త‌న అక్క‌సును వెళ్ల‌గ‌క్కా ర‌నే వాద‌న వినిపించినా.. లేక‌.. వైసీపీ వంటి ప్ర‌త్య‌ర్థి పార్టీ ల‌కు అమ్ముడు పోయార‌న్న వాద‌న వినిపించి నా.. దానికి ప్ర‌త్య‌క్ష కార‌ణం.. ప‌వ‌న్ క‌ళ్యాణే. టీడీపీలో పార్టీకి అంకిత భావంతో ప‌నిచేసిన వారికి టికెట్లు ద‌క్కాయి. పోనీ.. ఇవ్వ‌ని వారికి.. స్వాంత‌న అయినా ల‌భించింది. (తెనాలిలో రాజేంద్ర‌ప్ర‌సాద్‌)  జ‌న‌సేన‌లో నాయ‌కులు.. జెండాలు ప‌ట్టుకున్న‌వారికి ఆ మాత్రం స్వాంత‌న కూడా ల‌భించ‌లేదు. క‌నీసం.. టికెట్ల పందేరంలోనూ ఎలాంటి ప్రాతిప‌దిక‌నూ తీసుకోలేదు.


ఇప్పుడు పోతిన వంటి వారు ఒక్క‌రో ఇద్ద‌రో బ‌య‌ట‌కు రావొచ్చు.. కానీ, రేపు ఎన్నిక‌ల స‌మ‌యానికి ఇలాంటి వారు అంత‌ర్గ‌త శ‌త్రుత్వం పెంచుకుంటే.. పుట్టి మునిగేది పార్టీనే. ప‌వ‌నే స్వ‌యంగా త‌న చేతిలోని గాజు గ్లాసును నేల‌కేసి కొట్టి ప‌గ‌ల‌గొట్టుకుంటున్నార‌ని పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన వారే ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే.. ఇది వ్య‌క్తిగ‌తంగా ప‌వ‌న్‌కు ఇబ్బంది కాక‌పోవ‌చ్చు.. జెండాను దులిపి ప‌డేసి.. తాను కెమెరాల ముందుకు వెళ్లిపోవ‌చ్చు. కానీ, భ‌విష్య త్తులో మ‌రొక‌రు ఎవ‌రైనా పార్టీ పెట్టామ‌న్నా.. పెడ‌తామ‌న్నా.. న‌మ్మ‌క‌మే పోతున్న ప‌రిస్థితికి కార‌ణ‌భూతులు అవుతున్నార‌న్న‌ది మాత్రం వాస్త‌వం.

మరింత సమాచారం తెలుసుకోండి: