టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడన్న సంగతి అందరికీ తెలిసిందే.. గత కొద్దిరోజులుగా మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ ఎక్కువగా పర్యటనలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు సైతం చెక్ పెట్టి ఎక్కువగా మంగళగిరి ప్రాంతంలోనే తిరుగుతూ అక్కడ ప్రజలతో మమేకమయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నారు.. తనను ఈసారి మంగళగిరి లో గెలిపిస్తే ఈ నియోజకవర్గ రూపు రెక్కలు మారుస్తానంటూ అభివృద్ధి పథంలో నడిపిస్తానంటూ తెలియజేస్తున్నారు. ఎప్పుడు లేనంతగా ఈసారి ఎక్కువగా లోకేష్ మంగళగిరి పైన ఫోకస్ పెట్టారు..


ఇతర నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం చేపట్టేందుకు లోకేష్ కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. చంద్రబాబు వయసు రీత్యా ఎండను లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్నా.. రాష్ట్రవ్యాప్తంగా నిత్యం ప్రజలలో ఉండేలా పక్కా ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు.. అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజవర్గంలో దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. లోకేష్ మంగళగిరి దాటి బయటకు వెళ్లకుండా అక్కడే వివిధ వర్గాల వారిని కలుస్తూ నియోజవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు లోకేష్..అయితే లోకేష్ ఇక్కడే మకాం మార్చడానికి కూడా ముఖ్య కారణం ఉన్నది..


అయితే మంగళగిరిలో గెలవడం అనేది అంత సాధ్యమైన విషయం కాదనే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి.. ఎందుకంటే వైసీపీ అభ్యర్థి మురుగూడు లావణ్య కు కూడా స్థానికంగా చాలా పట్టు ఉందట.. అలాగే ఈమె తల్లి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే  మురుగూడు హానుమంతరావు కోడలు.. వీరికి రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే  ఈ ప్రాంతంలో వీరికి మంచి పేరుందట. ముఖ్యంగా చేనేత వర్గానికి అక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఉండటం వల్ల ఆ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి లావణ్య కావడంతో లోకేష్ గెలుపు పైన చాలా అనుమానాలు వినిపిస్తున్నాయి.. అయితే గడిచిన 2019 ఎన్నికలలో లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

ఓడిపోయిన చోటే గెలవాలని లోకేష్ మళ్లీ ఇక్కడే పోటీ చేస్తానని ఫిక్స్ అయినప్పటికీ టిడిపిలోని కొంతమంది నేతలు మాత్రం వేరే ప్రాంతాలు చూసుకోమని సూచించారట కానీ లోకేష్  మంగళగిరి వదిలి పారిపోయాడని.. ఓటమి భయంతోనే ఇతర నియోజకవర్గంలో నిలబడుతున్నారని ప్రచారం గట్టిగా వినిపించడంతో తిరిగి మళ్ళీ మంగళగిరి నుంచి గెలవాలని పట్టుదలతో ముందుకు వెళుతున్నారు లోకేష్. అందుకే తన ఫోకస్ మొత్తం మంగళగిరి పైన పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: