ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల పోరు కీలక దశకు చేరుకుంది.. కూటమి వర్సెస్ వైసీపీ మధ్య అధికారం కోసం పోరాటం చాలా తీవ్రస్థాయిలో జరుగుతూనే ఉంది.. ఇప్పటికే అటు వైసిపి, టిడిపి నేతల మధ్య హోరా హోరీగా ప్రచార యుద్ధం జరుగుతోంది.. ఇటీవలే బస్సు యాత్రను కూడా సీఎం జగన్ శరవేగంగా ముందుకు తీసుకు వెళుతున్నారు.. చంద్రబాబు కూడా ఎన్నికల సభలను నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నారు. సీఎం జగన్ తన ఎన్నికల మేనిఫెస్టో ప్రకటనకు సిద్ధమవుతున్నారని.. గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇందులో పేర్కొనే కొన్ని అంశాలు రాజకీయంగా ఆసక్తిని పెంచేలా కనిపిస్తున్నాయి.


ముఖ్యంగా ఆంధ్రాలో సీఎం జగన్ కు చంద్రబాబుకు మధ్య ప్రతిష్టాత్మకంగా ఈ రాజకీయాలు మారబోతున్నాయి. మూడు పార్టీల కూటమితో జగన్ ఓటమి లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. తాము తెచ్చిన సంక్షేమాలు సామాజిక న్యాయమే తమకు అధికారం అందిస్తుంది అంటూ జగన్ ధీమాతో ఉన్నారు.. అయితే ఈసారి జగన్కు పోటీగా సంక్షేమంలో సూపర్ సిక్స్ పథకాలను తీసుకువచ్చిన టీడీపి ఇప్పుడు వాటిని కూడా ఈరోజు రద్దుచేసి.. మేనిఫెస్టో అంశాల పైన ఫోకస్ పెట్టారు.. దీంతో పథకాలలో ఏ ఏ అంశాలు ఉండాలని విషయాన్ని ప్రజలకే వదిలేశారు.


అందులో భాగంగా "మీరు అడగండి.. మేము నెరవేరుస్తాం" అనే పేరుతో కూటమి..  8341130393 నెంబర్ కు మీరు అనుకునే అంశాలను వాట్సప్ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీలను మహిళా ఓటు బ్యాంకు కోసం టార్గెట్ చేసి ప్రకటించినప్పటికీ అవి పెద్దగా స్పందన రాలేదు. ఇక సీఎం జగన్ కూడా తన మేనిఫెస్టోని ఉగాది రోజున ప్రకటిస్తారని చెప్పినా ఇంకా ఎలాంటి విషయం చెప్పలేదు.. కేవలం బస్సు యాత్రలో ప్రజలతో మమేకమవుతూ.. వారు తన నుంచి ఏమి కోరుకుంటున్నారు అనే విషయం పైన తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.


అయితే గత పది రోజుల నుంచి ఎక్కువగా బస్సు యాత్రలో ప్రజల మధ్య ముఖాముఖి చర్చించుకున్న తర్వాత రైతు రుణమాఫీ పైన ఎక్కువ డిమాండ్ వినిపిస్తోందని అందులో ఎక్కువ మెజారిటీ కూడా పార్టీ నేతలు రైతు రుణమాఫీ వైపే మొగ్గు చూపుతున్నారట. మొదట జగన్ ఈ విషయం పైన సముఖత వ్యక్తం చేయకపోయినా.. వస్తున్న ప్రజాభిప్రాయం మేరకు ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తోంది. ఒకవేళ రుణమాఫీ మేనిఫెస్టోలో ఉంటే ఇది సీఎం జగన్కు బ్రహ్మాస్త్రంగా మారుతుందని.. అదేవిధంగా డ్వాక్రా మహిళలకు గత ఎన్నికల సమయంలో చెప్పినట్టుగా రుణమాఫీ విషయంపైనే కాకుండా మహిళలకు ఆర్థికంగా తోడ్పడేటువంటి హామీలు ఇచ్చేలా.. ప్లాన్ చేస్తున్నారట. మరి మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ ప్రకటిస్తే కూటమికి ఓటమి తప్పదని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: