అనకాపల్లి :  అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటే మాడుగుల, చోడవరం, పాయకరావుపేట లో ఏ పార్టీ ఆధిపత్యం చూపిస్తోందనే విషయం ఆసక్తి రేపుతుంది. ఆ చోట్ల వైసీపీ ఆధిపత్యం చూపిస్తుంది. ఇక అనకాపల్లి నర్శీపట్నం పెందుర్తిలలో అయితే ఆధిపత్యం టీడీపీకి అనుకూలంగా ఉంటుందని అంటున్నారు.ఇక ఎలమంచిలిలో  రెండు పార్టీలకు గట్టి పట్టు ఉంది. అయితే వైసీపీ మాత్రం మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో తమకు బలం ఉందని అంటూంటే టీడీపీ మొత్తం అసెంబ్లీ పార్లమెంట్ సీటుతో కలిపి ఖచ్చితంగా విజయం సాధిస్తామని అంటోంది. అయితే ఇద్దరికీ కూడా ఇది హోరా హోరీ పోటీగానే ఉంటుందని అంటున్నారు. ఓవరాల్ గా చెప్పాలీ అంటే సీఎం రమేష్ కి ఈ సీటు అంత సులభం కాదనే అంటున్నారు.మరో వైపు సుజనా చౌదరి విషయానికి వస్తే ఆయన వెళ్ళి మరీ బీసీలు మైనారిటీలు ఎక్కువగా ఉన్న విజయవాడ వెస్ట్ నుంచి పోటీకి దిగారు. అది కూడా చివరి నిముషంలో దిగారు. అక్కడ బీజేపీ అభ్యర్థిగా అంటే గట్టి సవాల్ ని ఆయన స్వీకరించినట్లే అని అంటున్నారు.


ఇక అక్కడ వైసీపీ గత రెండు ఎన్నికలను గెలవడం జరిగింది. ఆ పార్టీకి గట్టి బలం ఉంది. ఇప్పుడు మైనారిటీలకు టికెట్ ఇచ్చింది. ఎందుకంటే మైనారిటీలు నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారు.అదే విధంగా టీడీపీ అక్కడ గెలిచి ఎన్నో సంవత్సరాలు దాటింది. ఈ విధంగా చూస్తే బాగా టీడీపీ కూటమికి కష్టమైన సీటని అంటున్నారు. జనసేన మద్దతు ఉంటే గెలుపు ఆశలు ఉంటాయనుకుంటే అక్కడ బీసీ లీడర్ గా ఉన్న పోతిన మహేష్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఆయనతో పాటు మెజారిటీ జనసేన నేతలు అంతా కూడా పార్టీని వీడిపోతున్నారు. దానితో ఇది ఖచ్చితంగా గట్టి దెబ్బ అని అంటున్నారు.ఇక బీజేపీకి ఇక్కడ బలం కూడా చాలా తక్కువ. టీడీపీ సహాయంతోనే ఆ పార్టీ గెలవాల్సి ఉంది. మొత్తం మీద సుజనా చౌదరి మంచి నేత అయినప్పటికీ రాజకీయంగా విజయవాడ పశ్చిమ ఆయనకు పెను సవాల్ కానుందని అంటున్నారు.దీంతో ఆయన గెలుపు మీద అందరూ చర్చించుకుంటున్నారు. ఇంకా అలాగే సీఎం రమేష్ చేతికి అనకాపల్లి చిక్కుతుందా అన్నది మరో చర్చగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: