•కడపలో ప్రజల మద్దతు జగన్ కే
•షర్మిల ఓడిపోతే కాంగ్రెస్ కి ముప్పే
•తెరపైకి అవినాష్ రెడ్డి పంపిస్తాను

(కడప -ఇండియా హెరాల్డ్)
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలామంది జీవితాన్ని డిసైడ్ చేయబోతున్నాయి..మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో పోటీ పడుతున్న మంత్రులకు గెలుపు చాలా అవసరం. ఈసారి గనుక ఓడిపోతే ఇక ఎప్పటికీ రాజకీయ భవిష్యత్తు ఉండదనే నేపథ్యంలో చాలామంది మంత్రులు అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ తరఫున ఒంటరిగా పోరాటం చేస్తూ తాను చేపట్టిన సంక్షేమ పథకాలే తనను మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తాయనే ధీమా వ్యక్తం చేస్తున్నారు..మరోవైపు ఎలాగైనా సరే జగన్ ను గద్దె దించాలని సింగిల్ గా అయితే పోటీ చేయలేమని టీడీపీ, జనసేన , బిజెపి లతో పొత్తు పెట్టుకుని మరీ రంగంలోకి దిగుతోంది.. అయితే కూటమితో పోల్చుకుంటే వైసీపీ పార్టీకే ప్రజలలో ఎక్కువ మద్దతు లభిస్తోందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే.. కూటమిగా  ఏర్పడిన చంద్రబాబు,  పవన్ కళ్యాణ్ పరిస్థితి చావోరేవో అన్నట్టుగా మారిపోతుంది.

అయితే కాసేపు ఇదంతా పక్కన పెడితే .. ఇప్పుడు బరిలోకి జగన్ వర్సెస్ షర్మిల అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.. తోడబుట్టిన అన్నయ్య పైనే ఆమె కక్ష సాధింపు చర్యలు చేపడుతూ ఉండడం ప్రజలకు మింగుడు పడడం లేదు.. ప్రస్తుతం కాంగ్రెస్ తరపున కడప ఎంపీగా వైఎస్.షర్మిల పోటీ చేస్తుండగా ఈమెకు పోటీగా వైయస్ఆర్సీపీ తరఫున వైయస్ అవినాష్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే ఈమె జగన్ను టార్గెట్ చేస్తూ చేస్తున్న కామెంట్లు కడప ప్రజలకు ఇబ్బందిని కలిగిస్తున్నా.. వాస్తవానికి కడప నియోజకవర్గంలో వైయస్సార్ ఫ్యామిలీకి ఎంత మంచి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా మాత్రమే కాకుండా సీఎం గా పదవీ ప్రమాణం చేసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప ను  మరింత అభివృద్ధి పరిచారు.. అక్కడి ప్రజలలో తనపై మంచి ఇమేజ్ ని కూడా క్రియేట్ చేసుకున్నారు.. ఇలాంటి సమయంలోనే జగన్ ని విమర్శిస్తూ షర్మిల దుర్భాషలాడుతోంది .. అటు వైయస్ అవినాష్ రెడ్డిని ఓడించి.. ఇటు జగన్ ను కూడా  గద్దె దింపే ప్రయత్నం చేస్తోంది.

అయితే అక్కడి ప్రజలు మాత్రం రాజశేఖరరెడ్డి కూతురు,  వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అన్న ఒక కారణంతోనే ఆమెను వదిలేస్తున్నామని.. ఆ ధైర్యంతోనే ఆమె జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేస్తోందనే కామెంట్లు కూడా చేస్తున్నారు.. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని తెరపైకి తీసుకొస్తూ.. అనవసరపు వాగ్వాదానికి దిగుతూ.. కుటుంబ సభ్యులపైనే విచక్షణ రహితంగా కామెంట్లు చేస్తోంది షర్మిల.. ఇలాంటి సమయంలో జగన్ వర్సెస్ షర్మిల అనే ఒక కొత్త వార్త తెరపైకి వచ్చింది.. నూటికి నూరు శాతం కడప నియోజకవర్గం నుంచి షర్మిల గెలుపు పొందే అవకాశం లేదు ఎలాగో జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారనే ధీమా కూడా ఉంది ప్రజలలో.. ఇలాంటి సమయంలో జగన్ ముఖ్యమంత్రిగా మళ్లీ అధికారంలోకి వస్తే..  షర్మిల ఓడిపోతే ఇక ఈమె రాజకీయ భవిష్యత్తు ఇక్కడితో ముగిసిపోతుందనడం లో సందేహం లేదు. ఇప్పటికే తెలంగాణలో పార్టీ పెట్టి కాంగ్రెస్లో విలీనం చేసింది.. మరోవైపు తన కుటుంబానికి విద్రోహం చేసిన కాంగ్రెస్లో చేతులు కలపడం వైసిపి పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు.. పైగా ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఇంకా కొనసాగుతోంది అంటే అది రాజశేఖర్ రెడ్డి పేరు వల్లే ఒకవేళ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న షర్మిల ఓడిపోతే.. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుంది.. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోకుండా సొంత కుటుంబానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న ఈమె అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం మేలు చేస్తుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.. మొత్తానికైతే షర్మిలా గనుక ఓడిపోతే కచ్చితంగా ఇక రాజకీయ భవిష్యత్తుకు స్వస్తి పలకాల్సిందే అంటూ ప్రజలు కూడా అప్పుడే జోష్యం చెబుతున్నారు.. మరి ఈ ఎన్నికలు ఎవరికి ఏ విధంగా రాజకీయ భవిష్యత్తును డిసైడ్ చేస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: