ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయం రసవత్తరంగా మారింది.. అధికార పార్టీ వైసీపీ ఈ సారి గెలుపే లక్ష్యంగా జోరుగా ప్రచారం చేస్తుంది.. ప్రతి పక్షాలపై విమర్శల వర్షం కురిపిస్తుంది.. నిత్యం ప్రజలతో మమేకం అవుతూ గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తుంది.. ఇదిలా ఉంటే రాష్ట్రంలో అధికార పార్టీని గద్దె దించాలనే ప్రధాన ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీలు అయిన బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడి వైసీపీ ని సమిష్టిగా ఎదుర్కొంటున్నాయి.. అయితే వైసీపీ మాత్రం కూటమి వ్యూహాలు నీరుగార్చేందుకు సరికొత్త వ్యూహాలను రచిస్తుంది..జాతీయ పార్టీ బీజేపీని రాష్ట్రంలో బలపడనివ్వకుండా వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.

దానిలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అయిన దగ్గుబాటి పురందేశ్వరిపై వైసీపీ మరో ఆరోపణ చేస్తుంది.రాష్ట్రంలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ ఆమె మీడియాకు వెల్లడించినట్లు వీడియోలు సృష్టించి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నాయి..వైసీపీ ప్రభుత్వం మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్లు అన్యాయంగా కట్టబెట్టిందని పురందేశ్వరి ఆరోపించినట్లు, కూటమి గెలిచిన వెంటనే ఆ రిజర్వేషన్ల రద్దుపై తొలి సంతకం చేసేందుకు చంద్రబాబు, పవన్‌ సానుకూలంగా స్పందించారని పురందేశ్వరి ప్రకటించినట్లు పలు సోషల్ మీడియా వెబ్ సైట్స్ లో వైరల్ చేస్తున్నారు.

రీసెంట్ గా విశాఖ పోర్టులో సీబీఐ తనిఖీలు చేసిన డ్రగ్స్‌ వ్యవహారంలో కూడా ఆమెకు సంబంధం ఉందంటూ  తప్పుడు కథనాలు ప్రచురితమయ్యాయి.దీంతో ఇలాంటి ఫేక్ న్యూస్ లను క్రియేట్ చేస్తున్న వారికి ఆమె పరువునష్టం నోటీసులు ఇచ్చారు. రాజమండ్రి పార్లమెంటు నుంచి పురందేశ్వరి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరుసగా ఫేక్‌ న్యూస్‌ సృష్టించి అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నవారిపై కఠినచర్యలు తీసుకోవాలంటూ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ ఈసీకి విజ్ఞప్తిచేశారు. ఇదే అంశంపై బీజేపీ ఏపీ మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు షేక్‌ బాజీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, 'ప్రతిసారి ఎన్నికలు రాగానే రిజర్వేషన్ల అంశం తెరపైకి వస్తుంది. నకిలీ వార్తలపై సైబర్‌ క్రైంకు ఫిర్యాదు చేస్తాం' అని ఆయన అన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: