గ‌త రెండు రోజులుగా రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం విజ‌య‌వాడ వెస్ట్‌. ఈ టికెట్‌ను ఆశిం చిన జ‌న‌సేన నాయ‌కుడు, బీసీ సామాజిక వ‌ర్గం న‌గ‌రాలుకు చెందిన పోతిన మ‌హేష్‌కు మొండి చేయి మిగిలింది. దీంతో కొన్నాళ్లు వేచి చూసిన పోతిన‌.. రెండు రోజుల కింద‌ట పార్టీకి రాజీనామా చేశారు. రేపో మాపో ఆయ‌న వైసీపీలోకి చేర‌నున్నారు. దాదాపు ఇప్ప‌టికే చ‌ర్చ‌లు కూడా పూర్త‌య్యాయి. ఇక‌, జ‌గ‌న్ విజ‌య‌వాడ‌లోకి ఎంట్రీ ఇచ్చిన మ‌రుక్ష‌ణం పోతిన కండువా క‌ప్పుకోవ‌డ‌మే త‌రువాయి.


ప్ర‌స్తుతం ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో ఉన్న జ‌గ‌న్‌.. రేపు లేదా ఎల్లుడి విజ‌య‌వాడ ప‌రిధిలోకి వ‌స్తారు. ఈ నేప‌థ్యంలో పోతిన వైసీపీ లోకి చేర‌నున్నారు. ఇంత వ‌ర‌కు ఓకే.. అయితే.. బ‌ల‌మైన గ‌ళం వినిపించే పోతిన‌ను వైసీపీ పూర్తిగా వెస్ట్‌లో వినియోగించుకునేందుకు రెడీ అవుతోంది. ఇదే జ‌రిగితే ఆయ‌న ప్ర‌భావం ఇక్క‌డ ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచిన సుజ‌నా చౌద‌రిపై ప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.



గత 2019 ఎన్నిక‌ల్లో పోతిన మ‌హేష్ జ‌న‌సేన టికెట్‌పై పోటీ చేశారు. 24 వేల పైచిలుకు ఓట్లు సంపాయిం చుకున్నారు. అయితే.. అప్ప‌టికి ఇప్ప‌టికి మ‌హేష్ గ్రాఫ్ పెరిగింద‌ని జ‌న‌సేన నాయ‌కులే చెబుతున్నారు. అందుకే ఆయ‌న‌కు ప‌వ‌న్ కూడా ముందు టికెట్ ఇస్తామ‌ని చెప్పార‌ని అంటున్నారు. కానీ, పొత్తు ధ‌ర్మంలో భాగంగా దీనిని బీజేపీకి ఇచ్చేశారు ఇక‌, మ‌హేష్ గ్రాఫ్‌ను ప‌రిశీలిస్తే.. ఆయ‌న‌కు 70 వేల దాకా ఓటు బ్యాంకు పెరిగింద‌ని అంటున్నారు.



దీనిలో స‌గం వేసుకున్నా.. క‌నీసంలో క‌నీసం 40 వేల ఓటు బ్యాంకు అయితే.. పోతిన‌కు వ్య‌క్తిగ‌తంగా పెరిగింద‌నేది వాస్త‌వ‌మే. ఈ విష‌యంపై వైసీపీ కూడా స‌ర్వే చేయించింది. ఇది నిజ‌మేన‌ని తేలిన త‌ర్వాతే. ఆయ‌న‌ను పార్టీలోకి తీసుకునేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండ‌డం.. స‌మ‌స్య‌ల‌పై పోరాటాలు చేయ‌డం వంటివి పోత‌న గ్రాఫ్‌ను పెంచాయి. ఇది ఇప్పుడు వైసీపీకి ద‌న్నుగా మారితే.. అది మిత్ర‌ప‌క్షాల‌కు ఇబ్బంద‌నే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. దీంతో అయిందేదో అయిపోయింది.. పోతిన‌ను బుజ్జ‌గించాల‌ని ప‌వ‌న్‌కు కొంద‌రు నేత‌లు చెబుతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: