ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం ప‌రుచూరులో ఏలూరి సాంబ‌శివ‌రావు గేమ్ స్టార్ట్ చేశారు. వాస్త‌వానికి వివాద ర‌హితుడిగా.. చీమ‌కైనా అప‌కారం త‌ల‌పెట్ట‌ని నాయ‌కుడిగా ఆయ‌న‌కు పేరుంది. అయితే.. ఈ మంచిత‌నాన్ని వైసీపీ అలుసుగా తీసుకుంది. ఆయ‌న‌ను వివిధ‌కేసుల్లో ఇరికించి.. అణిచేయా ల‌ని చూసింది. దీంతో అన్నింటినీ ఓపిక ప‌ట్టిన ఏలూరి.. ఇప్పుడు ఎన్నిక‌ల స‌మ‌యంలో వ్యూహాత్మంగా త‌న గేమ్‌ను స్టార్ట్ చేశారు. ఈ గేమ్‌లో వైసీపీ ఇప్పుడు చుక్క‌లు చూస్తోంది.


వైసీపీ విష‌యానికి వ‌స్తే.. ప‌రుచూరులో బ‌ల‌మైన నాయ‌కులు లేరు. కేడ‌ర్ ఉన్నా. వారిని న‌డిపించే నేతల విష‌యంలో వైసీపీ త‌డ‌బాటు ప‌డింది. దీంతో ఏడాదికి ఒక‌సారి ఇక్క‌డ ఇంచార్జ్‌ల‌ను మార్చ‌డం.. పారిపో యే నేత‌లుగా పేరున్న వారికే టికెట్లు ఇవ్వ‌డం వంటివి కామ‌న్‌గా మారాయి. దీంతో కేడ‌ర్‌లోనూ వైసీపీపై న‌మ్మ‌కం పోయింది. దీనిని గుర్తించిన ఏలూరి.. ఇప్పుడు ఆప‌రేష‌న్ ప్రారంభించారు. వైసీపీకి ఎక్క‌డైతే బ‌లం ఉందో గుర్తించి.. ఆయా ప్రాంతాల్లోని కీల‌క నేత‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొంటున్నారు.



టీడీపీలో మంచి పొజిష‌న్ ఇప్పిస్తాన‌ని వారికి హామీ ఇచ్చి.. త‌న‌వైపు మ‌ళ్లించుకుంటున్నారు. దీంతో వైసీపీ కి అంతో ఇంతో బ‌లంగా ఉన్న నాయ‌కులు కూడా..ఇ ప్పుడు ఏలూరికి జై కొడుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ గెలుస్తుంద‌ని ఆ పార్టీ నేత‌ల‌కే ఎవ్వ‌రికి న‌మ్మ‌కాలు లేవు. ఇక‌, ప్ర‌ధానంగా వైసీపీ మైన‌స్‌ల‌ను ఎత్తి చూప‌డంలోనూ ఏలూరి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక్క‌డ నిక‌ర‌మైన నాయ‌కు డు లేక‌పోవ‌డం.. ప్ర‌స్తుతం వ‌చ్చిన ఎడ‌మ బాలాజీ కూడా.. ఎన్నిక‌లు అయ్యాక ఉంటారో ఉండ‌ర‌నో.. చ‌ర్చ‌ను లేవ‌నెత్త‌డంలోనూ ఏలూరి స‌క్సెస్ అయ్యారు.


మ‌రోవైపు.. వైసీపీ కేడ‌ర్‌లో నెల‌కొన్న నిరాశ‌, నిస్పృహ‌ల‌ను కూడా ఏలూరి గుర్తించారు. ఎందుకంటే.. నాయకుడు ఎవ‌రైనా.. ప‌ట్టుమ‌ని ఏడాది పాటు ఉండి.. ఇక్క‌డి కార్య‌క్ర‌మాలు ముందుకు తీసుకువెళ్లాల‌నే కేడ‌ర్ కోరుకుంటుంది. కానీ, ఈ విష‌యంలో వైసీపీ విఫల‌మైంది. పైగా కేడ‌ర్ నుంచి ఎలాంటి ఫీడ్ బ్యాక్ తీసుకోకుండానే నిర్ణ‌యాలు చేస్తున్నారు. దీంతో వైసీపీ కేడ‌ర్ తీవ్ర‌నిరాశలో కూరుకుపోయింది.

 

దీనిని గ‌మ‌నించిన ఏలూరి కూడా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లువురు వైసీపీ కీల‌క నేత‌ల‌ను త‌న చెంత‌కు చేర్చుకున్నారు. నిజానికి ఇప్ప‌టి వ‌రకు ఇలాంటి చ‌ర్య‌ల‌కు ఇష్ట‌ప‌డ‌ని ఏలూరి వైసీపీ ద్వంద్వ రాజ‌కీయాల నేప‌థ్యంలో తాను కూడా రూటు మార్చుకుని.. వైసీపీకి చుక్క‌లు చూపిస్తుండడం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: