ఏపీలో నేటి నుంచి పొలిటిక‌ల్ ముఖ చిత్రం మార‌నుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం త‌పిస్తున్న టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీలు బుధ‌వారం నుంచి ఉమ్మ‌డి స‌భ‌ల‌కు ప్లాన్ చేశాయి. ఇక‌, వైసీపీ ఇప్ప‌టికే చేస్తున్న బ‌స్సు యాత్ర‌ల‌కు తోడు.. వాహ‌న యాత్ర‌ల‌ను పెంచాల‌ని నిర్ణ‌యించుకుంది. మ‌రోవైపు.. ఈ వారంలోనే కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్ర‌నేత‌ల ప్ర‌చారం ప్రారంభం కానుంది. ఫ‌లితంగా ఏపీలో రాజ‌కీయ వేడి మ‌రింత కాక‌తేల‌నుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.


చేసిన‌వి చెబుతూ..
వైసీపీ విష‌యానికి వ‌స్తే.. గృహ సార‌థులు బుధ‌వారం నుంచి మ‌రింత వేగంగా తిర‌గాల‌ని ల‌క్ష్యంగా పెట్టా రు. వ‌లంటీర్లు ఇప్ప‌టికే స‌గం మంది త‌మ ఉద్యోగానికి రాజీనామాలు చేసి.. వైసీపీ త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తు న్నారు. మిగిలిన వారు కూడా.. వైసీపీ త‌ర‌ఫున ప్ర‌చారం చేసేలా తెర‌చాటున మంత్రాంగాలు జ‌రుగుతు న్నాయి. దీంతో అంద‌రినీ ఏక‌తాటిపైకి తీసుకువ‌చ్చి.. చేసిన‌వి చెప్పేలా ఇంటింటికీ పంపించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీంతో వైసీపీకి మెజారిటీ నాయ‌కుల ప్ర‌చారం క‌న్నా.. వీరిపైనే  ఎక్కువ‌గా డిపెండ్ అయ్యార‌ని తెలుస్తోంది.


టార్గెట్ జ‌గ‌న్‌..!
ఇక‌, విప‌క్షాల విష‌యానికి వ‌స్తే.. టార్గెట్ జ‌గ‌న్‌గా ముందుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇప్ప‌టికే ఈ నిర్ణ‌యం మేరకు ప్ర‌చారం చేస్తున్నారు. అయితే, రానున్న ఎన్నిక‌ల్లో ఈ ప్ర‌చారాన్నే మ‌రింత ముమ్మ‌రం చేయాల‌ని పార్టీలు నిర్ణ‌యించుకున్నాయి. దీంతో బుద‌వారం నుంచి మూడు పార్టీలూ ఉమ్మ‌డిగా చేసే ప్ర‌చారంలో జ‌గ‌న్ త‌ప్పులనే ప్ర‌ధానంగా ప్ర‌చారం చేయ‌నున్నారు. దీంతో ఆ వ్య‌తిరేక‌త త‌మ‌కు క‌లిసి వ‌స్తుంద‌ని అంచ‌నా వేసుకున్నాయి.


చిన్న పార్టీల పెద్ద‌ప్లాన్‌..
చిన్న పార్టీలైన‌.. ఆప్‌, ప్ర‌జాశాంతి, జైభీం, జై భార‌త్ వంటివి చేతులు క‌లుపుతున్నాయి. టికెట్లు పంచుకునేలా ఈ నాలుగు పార్టీలూ ఒప్పందం చేసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. దీనికి కూడా బుధ‌వార‌మే ముహూర్తంగా నిర్ణ‌యించారు. హైద‌రాబాద్‌లో జ‌రిగే స‌మావేశంలో ఈ నాలుగు పార్టీలూ.. చేతులు క‌లిపి టికెట్‌లు పంచుని ప్ర‌చారం చేయ‌నున్నారు. దీంతో ఈ పార్టీల సెగ కూడా పెరుగుతుంది. ఇక‌, కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టికే ష‌ర్మిల కేంద్రంగా రాజ‌కీయాలు ముమ్మ‌రం చేసింది. ఈ వారంలోనే రాహుల్ ఏపీలో ప‌ర్య‌ట‌న‌కు రానున్నారు. ఇలా.. ఏపీలో నేటి నుంచి రాజ‌కీయ ముఖ చిత్రం మ‌రింత మారుతుంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: