ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ మరియు పార్లమెంట్ కి ఎన్నికల హడావుడి మొదలైంది.ఇప్పటికే అధికార మరియు ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచేసారు.ఈ సారి జరగబోయే ఎన్నికలు ఎంతో రసవత్తరంగా మారనున్నాయి.అధికార పార్టీ వైసీపీ మరియు టీడీపీ ఉమ్మడి కూటమి మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా పోటీ ఉండనుంది. అయితే ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ 175 నియోజకవర్గాలకు గాను అభ్యర్థులను ప్రకటించి ప్రచార హోరు కొనసాగిస్తుంది.ఒకవైపు బీజేపీ,టీడీపీ, జనసేన కూటమి కూడా తమ అభ్యర్థులను ప్రకటించి ఎవరికి వారే ప్రచారంలో మునిగిపోయారు.ఇప్పటికే ప్రధాన పార్టీలు అన్నీ నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించగా కొన్ని నియోజకవర్గాలలో మాత్రం అభ్యర్థుల విషయంలో మార్పులు చేర్పులు చేసే యోచనలో అధిష్టానం చూస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఒక వేళ మార్చేటట్లయితే ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థుల విషయాలు బయటికి వచ్చే ఛాన్స్ ఉంది.ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి.

ముఖ్యంగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటే ఇక్కడ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడ నుండి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలిచి రికార్డు సృష్టించారు.2014,2019 వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. అయితే ప్రస్తుతం ఓటమిలేని నేతగా గుర్తింపు పొందిన పిన్నెల్లికి మొదటిసారి ఓటమి భయం మొదలు అయింది అని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు.ప్రస్తుతం అక్కడ అదే హాట్ టాపిక్ యింది.నాలుగు సార్లు ఎమ్మెల్యే గా ఉండటం వల్ల నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి లేకపోవటంతో అక్కడ ఆయనకు వ్యతిరేకత మొదలైనదనే చెప్పాలి.ఆయన పై చేసిన అవినీతి ఆరోపణలు, హత్యా రాజకీయాలు, టోల్ గేట్, అక్రమ మైనింగ్ లాంటి అనేక విషయాలు ఆయనను ఊపిరి ఆడకుండా చేస్తున్నాయి.

అలాగే ఆయనకు తన సొంత పార్టీ నేతల నుండి వ్యతిరేక సెగలు వీస్తున్నాయి.అయితే టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పిన్నెల్లికి పోటీగా బరిలో ఉన్నారు.ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గంలో జూలకంటి ప్రజలతో మమైకమై దూసుకుపోతున్నారు.ఆయన గ్రాఫ్ గతంలో కంటే చాలా రెట్లు పెరిగినట్లు తెలుస్తుంది.అయితే అక్కడి నియోజకవర్గం వర్గ ప్రజలు మాత్రం బ్రహ్మానందరెడ్డి అధికారంలోకి వస్తే బాగుంటుందని అంటున్నారు.ఆయన్ని గెలిపించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది.జూలకంటినే పిన్నెల్లికి సరైన పోటీ అని అక్కడి ప్రజలు అనుకుంటున్నట్లు తెలుస్తుంది.అయితే చివరికి ఏం జరుగుందనేది చూడాలంటే ఎన్నికల అయిపోయేదాక వేచి ఉండాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: