ఇదేంటి ఈ టైటిల్ షాకింగ్‌గా ఉంది.. ఇది నిజం అనుకుంటున్నారా నిజ‌మే.. టీడీపీలోకి వెళ్లేందుకు రెడీ అయిన కొంద‌రు బ‌లిజ నేత‌ల‌తో ప‌రుచూరు వైసీపీ ఇన్‌చార్జ్ ఎడం బాలాజీ మ‌నం మ‌నం ఒక్క‌టే... మీరు నాతో పాటే వైసీపీలో ఉండాల‌ని ఒత్తిడి చేయ‌గా.. మ‌నం మ‌నం ఒకే క్యాస్ట్ అయితే మ‌న‌మంద‌రం క‌లిసి మ‌నోడి పార్టీ అయిన జ‌న‌సేన‌లోకి వెళ్లిపోదాం.. నువ్వు వైసీపీలో ఉండ‌డం ఎందుకు.. అంద‌రం క‌లిసి జ‌న‌సేన‌కు వెళ్లిపోదాం వ‌చ్చేయ్ అని చెప్ప‌డంతో అవాక్క‌వ్వ‌డం ఎడం బాలాజీ వంతు అయ్యింది.
గ‌త వారం రోజులుగా ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గంలో కాపు సామాజిక వ‌ర్గం వారంతా సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావు స‌మ‌క్షంలో కంటిన్యూగా టీడీపీలోకి వెళ్లిపోతున్నారు.

వీరిని క‌ట్ట‌డి చేయ‌డం ప‌రుచూరు వైసీపీ క్యాండెట్ ఎడం బాలాజీ వ‌ల్ల కావ‌డం లేదు. అస‌లు విష‌యంలోకి వెళితే ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల ప్ర‌చారం వేడిగా న‌డుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ అభ్య‌ర్థి ఏలూరు సాంబ‌శివ‌రావు స‌మ‌క్షంలో బలిజ ( కాపు) వ‌ర్గం నేత‌లు వ‌రుస పెట్టి క్యూ క‌ట్టేస్తున్నారు. మార్టూరు బ‌ల‌రాం కాల‌నీకి చెందిన కాపు నేత‌ల‌తో పాటు కారంచేడు మండ‌లం నుంచి కూడా కొంద‌రు కాపు నేత‌లు టీడీపీలో వ‌రుస‌పెట్టి చేరుతూ వ‌స్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఇదే వ‌ర్గానికి చెందిన కాపు ఓట‌ర్లలో కొంద‌రు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ప‌రుచూరు వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉండ‌డంతో ఆయ‌న‌తో కొన‌సాగారు. 

ఆమంచి ప‌రుచూరులో పోటీ చేయ‌లేనని చెప్పేసి ఆ త‌ర్వాత పార్టీనే వీడి వెళ్లిపోయారు. అనంత‌రం నియోజ‌క‌వ‌ర్గంలో కాపులు అంద‌రూ త‌మ‌కు వైసీపీలో న్యాయం జ‌ర‌గ‌ద‌ని.. త‌మ‌ను ఏలూరి మాత్ర‌మే ఆదుకుంటార‌ని డిసైడ్ అయిపోయి వ‌రుస‌పెట్టి టీడీపీలో చేరిపోతున్నారు. గ‌త వారం రోజులుగా ఇదో య‌జ్ఞంలా జ‌రుగుతోంది. ఏలూరి వ్య‌క్తిత్వంతో పాటు అటు జ‌న‌సేన స‌పోర్ట్ కూడా తోడవ్వ‌డంతో వైసీపీ ఇన్‌చార్జ్ ఇదే సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి అయినా కూడా ఆయ‌న వెంట ఎవ్వ‌రూ ఉండ‌ట్లేదు.. అంద‌రూ సైకిల్ ఎక్కేస్తున్నారు. 

బాబ్బాబు ఆగండ్రా అబ్బాయిలు...
నియోజ‌క‌వ‌ర్గంలో ఇత‌ర సామాజిక వ‌ర్గాలు కూడా వ‌రుస పెట్టి సైకిల్ ఎక్కేస్తున్నాయి. చివ‌ర‌కు త‌న సామాజిక వ‌ర్గం వాళ్లు కూడా త‌న మాట విన‌క‌పోవ‌డంతో విస్తుపోవ‌డం బాలాజీ వంతు అవుతోంది. ఇప్ప‌టికే ఆయ‌న‌కు గెలుపుపై ఆశ‌లు స‌న్న‌గిల్లాయంటున్నారు. దీంతో మీరు పార్టీ మారిపోతే తాను అస‌లు ఎమ్మెల్యేగానే పోటీ చేయ‌న‌ని చెపుతున్న ప‌రిస్థితి ఉంద‌ని ప‌రుచూరులో టాక్ గుప్పుమంటోంది. దీంతో వాళ్లు కూడా మ‌న‌మంద‌రం ఒకే కులం అయితే.. మ‌నోడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెట్టిన జ‌న‌సేన పార్టీలోకి అంద‌రం క‌లిసి వెళ్లిపోదాం.. నువ్వు వైసీపీకి రాజీనామా చేసి మాతో పాటు వ‌చ్చేయ్ అని చెప్ప‌డంతో బాలాజీ మొఖం మాడిపోవ‌డంతో పాటు అవాక్క‌వ్వ‌డం ఆయ‌న వంతు అయ్యింద‌ట‌. 

ఇటు ఏలూరి సాంబ‌శివ‌రావు నియోజ‌క‌వ‌ర్గంలో కాపుల‌కు మంచి ప్రాధాన్య‌త ఇచ్చారు. కారంచేడు మండ‌ల పార్టీ ప‌ద‌వితో పాటు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు క‌మిటీలు, అనుబంధ విభాగాల్లోనూ వాళ్ల‌కు మంచి మంచి ప‌ద‌వులే క‌ట్ట‌బెట్టారు. దీంతో వారంతా ఏలూరి వైపే ఉన్నారు. ఇక అర‌కొర‌గా ఉన్న వాళ్లు కూడా ఇప్పుడు ఆయ‌న నాయ‌క‌త్వాన్నే స‌మ‌ర్థిస్తున్నారు. అస‌లు ఎన్నిక‌లు నామినేష‌న్ల టైంకే బాలాజీకి ఇలాంటి ప‌రిస్థితి ఉంటే ఆయ‌న పోటీలో ఉంటారా ? లేదా వైసీపీ నుంచి కొంద‌రు క్యాండెట్లు మారిపోతారంటూ జ‌రుగుతోన్న జాబితాలో ఈయ‌న కూడా చేరుతారా ? అన్న‌ది స్థానిక వైసీపీ కేడ‌ర్‌కే అంతు ప‌ట్ట‌ని ప‌రిస్థితి. ఏదేమైనా బాలాజీ ఊగిస‌లాట‌లో ఉన్నార‌న్న వార్త‌లు కూడా అధిష్టానం చెవిలో ప‌డిన‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: