ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వందల సంఖ్యలో వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ల వేతనాలు డబుల్ చేస్తామని చెబుతున్నా రాజీనామాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా కర్నూలులో ఏకంగా 399 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. అయితే వాలంటీర్ల రాజీనామాల వెనుక వైసీపీ మాస్టర్ ప్లాన్ ఉందని సమాచారం అందుతోంది. చంద్రబాబు హామీలను వాలంటీర్లు నమ్మడం లేదని ప్రూవ్ చేయించాలని వైసీపీ ఈ దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది.
 
వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసినా వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రిజైన్ చేసిన వాలంటీర్లకు మళ్లీ ఉద్యోగాలు ఇస్తారు. కూటమి అధికారంలోకి వస్తే మాత్రం వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించినా కొన్ని మార్పులు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. మండపేటలో సైతం 800 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్టు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఎన్నికల సమయానికి 80 నుంచి 90 శాతం వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసే ఛాన్స్ ఉంది.
 
ఏపీలో దాదాపుగా 2.5 లక్షల మంది గ్రామ, వార్ద్ వాలంటీర్లు ఉన్నారు. ఈ వాలంటీర్లలో చాలామంది వైసీపీ ఫ్యాన్స్ కాగా వైసీపీ వల్ల తమకు ఉద్యోగం వచ్చిందనే కృతజ్ఞత సైతం వాళ్లలో ఉంది. వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలే అని వైసీపీ మంత్రులు పలు సందర్భాల్లో కామెంట్లు చేశారు. మరోవైపు వాలంటీర్ల వేతనాల పెంపు విషయంలో వైసీపీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
 
పార్టీని నమ్ముకుని పార్టీ కోసమే రేయింబవళ్లు కష్టపడుతున్న వాలంటీర్లకు మేలు జరిగేలా వైసీపీ హామీలను ప్రకటిస్తే బాగుంటుందని వైసీపీ నేతలు, కార్యకర్తలు ఫీలవుతున్నారు. జగన్ సర్కార్ కు ప్రజల్లో మంచి పేరు రావడంలో వాలంటీర్ల పాత్ర ఎంతో ఉంది. ప్రస్తుత కాలంలో 5,000 రూపాయల వేతనం పెరిగిన ఖర్చుల ప్రకారం అస్సలు సరిపోదు. వైసీపీ కోసం తమ ఉద్యోగాలను సైతం వదులుకుంటున్న వాలంటీర్లకు మేలు చేసేలా అడుగులు వేయాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: