తెలుగు మీడియా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రాజకీయ పార్టీలకు అనుకూలంగా మీడియా ఛానళ్లు మారిపోయాయి. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఎల్లో మీడియా, వైసీపీకి అనుకూలంగా బ్లూ మీడియా అవసరాలకు తగ్గట్లు తటస్థ మీడియా ఇలా వర్గాలుగా విడిపోయి ఏపీ రాజకీయాలకు శాపంగా మారాయి. ఎవరి స్వార్థ ప్రయోజనాలను వారు చూసుకుంటూ ప్రజా సమస్యలను పక్కన పెట్టేస్తున్నారు.


టీడీపీ బ్లూ మీడియాగా పిలుచుకునే సాక్షి, టీవీ 9, ఎన్టీవీలను నిషేధించింది. అటు వైసీపీ కూడా ఈటీవీ, టీవీ 5, ఏబీఎన్ ఛానళ్లను పక్కన పెట్టింది. అయితే ఇప్పుడు ఎన్నికల ముంగిట తాము అభిమానించే పార్టీలను పైకి లేపడానికి ఆయాన మీడియాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో ఎన్టీవీ టాప్ మీడియాగా ఉంది. టీఆర్పీ రేటింగ్ లో మొదటి స్థానంలో ఉంది.


ఆ తర్వాత స్థానంలో టీవీ 9 ఉంది. ఇక మూడో ప్లేస్ లో సాక్షి ఉంది. అయితే ఇప్పుడు ఈ ఎన్నికల్లో మూడు ఛానళ్లు కూడా వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నాయి. టీఆర్పీ రేటింగ్ లో టాప్ 3 ఛానళ్లు వైసీపీకి.. ఆ తర్వాత స్థానాల్లో ఉన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఈటీవీలు టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నాయి. ఇది టీడీపీ కూటమికి ఇబ్బందికర పరిస్థితిగా మారింది. బ్లూ మీడియా టీఆర్పీ రేటింగ్ లు టాప్ లో కొనసాగుతుండగా.. ఎల్లో మీడియా మత్రం టీఆర్పీ రేటింగ్ పెరగలేదు.


ఇక టీవీ 9 తో జగన్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మరోవైపు బిగ్ డిబేట్ పేరుతో ఏబీఎన్ కు చంద్రబాబు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వీటి వ్యూయర్ షిప్ లను పరిశీలించినట్లయితే.. టీవీ 9 లైవ్ ఇంటర్వ్యూను ఒకేసారి 90 వేల మంది చూశారు. ఇదే సమయంలో చంద్రబాబు బిగ్ డిబెట్ వ్యూయర్ షిప్ కేవలం 27వేలు మాత్రమే ఉంది. దీనిని వైసీపీ నాయకులు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇది జగన్ సత్తా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: