•విశాఖలో వైసీపీ టీడీపీ మధ్య టఫ్ ఫైట్ 
•వైసీపీకి అనుకూలంగా మారిన విశాఖ రాజకీయం
•ఎక్కువ ఓట్లు కోసం ఎక్కువ నోట్లు రాలుస్తున్న టీడీపీ


విశాఖ - ఇండియా హెరాల్డ్: పాలిటిక్స్ లో ఓటుకు నోటు అన్నది ఎంత హాట్ టాపిక్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంకో రెండ్రోజుల్లో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ సామాన్య ఓటర్ల విషయంలోనూ అదే ప్రక్రియ స్టార్ట్ అయిపోయిందని ఇండియా హెరాల్డ్ సర్వేలో తెలిసిపోయింది.ఇక విశాఖ ఎంపీ స్థానం నుంచి టీడీపీ తరుపున బాలకృష్ణ చిన్నల్లుడు పోటీ చేస్తుండటంతో.. ఇప్పుడు టీడీపీకి ఆ సీటు చాలా అంటే చాలా కీలకంగా మారింది. మరోపక్క విశాఖను ఆంధ్రప్రదేశ్ కి రాజధానిగా ప్రకటించింది అధికారిక వైసీపీ. అలాంటి చోట ఆ పార్టీని ఓడించాలనే పంతంతో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుందని ఇది వరకే వార్తలు గట్టిగా వినిపించాయి. ఇప్పటికీ అదే ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.తమ సొంత సామాజిక వర్గం వారిని ఎంపీగా చేసి అంతర్జాతీయ నగరంలో రాజకీయ పాగా వేయాలని చూస్తున్నారని సమాచారం తెలుస్తుంది. ఈ ఓటుకు నోటు ప్రక్రియ ని కేవలం టీడీపీ మాత్రమే కాదు వైసీపీ కూడా ఫాలో అవుతుంది. కానీ ఎక్కువ ఓట్లు రాలాలంటే ఎక్కువ నోట్లు ఇవ్వాల్సిందే. అందుకే దానిపై టీడీపీ దృష్టి పెట్టింది.ఎలాగైనా విశాఖలో విజయం ఇలా సిద్ధపడుతున్నారని తెలుస్తుంది. వాస్తవానికి విశాఖ ఎంపీ సీటులో గట్టి పోటీ నడుస్తోందనే చెప్పాలి.


అయితే మెజారిటీ ఓటర్ల మొగ్గు మాత్రం ఖచ్చితంగా వైసీపీ వైపే ఉందనే కామెంట్లూ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వైసీపీని ఎలాగైనా ఓడించి తీరాలన్న కసితో సుమారు పోలింగ్ కి పది రోజుల ముందు నుంచే నోట్లతో ఓట్ల కొనుగోలుకి టీడీపీ తెర తీస్తోందని పెద్ద ఎత్తున ప్రచారం ఇప్పటికీ కొనసాగుతోంది.వైసీపీ లోకల్ క్యాడిడేట్  బొత్స ఝాన్సీని ఎంపీ అభ్యర్ధిగా పోటీలోకి దించింది. ఈ సమయంలో ఆమెకు రోజు రోజుకీ ప్రజల నుంచి ఆదరణ, అభిమానం, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండటంతో.. టీడీపీ అభ్యర్ధి శ్రీ భరత్ ఆమె ముందు తేలిపోతున్నారు.పైగా విశాఖ రాజధాని అని, అక్కడ నుంచే పాలన అని జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేయడంతో ఆ ప్రభావం కూడా టీడీపీ ఓటమి పై పడినట్లు.అందుకే నోట్ల కట్టలతో రాజకీయం మొదలెట్టేశారు టీడీపీ తమ్ముళ్లు.. ఎలాగో ఎన్నికల వేళల్లో ఏ పార్టీ అయిన ఓట్ల కోసం నోట్లు ఇవ్వడం కామన్ కాబట్టి వైసీపీ ఓటుకి 2000 నుంచి 3000 ఇవ్వాలని చూస్తుంటే టీడీపీ మాత్రం 4000 నుంచి 10000 వేలు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు ఇండియా హెరాల్డ్ సర్వే ద్వారా తేలింది. చూడాలి మరి ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటాయనేది..!?

మరింత సమాచారం తెలుసుకోండి: