ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ వేసుకోవడానికి కేవలం రెండు రోజులు మాత్రమే గడివు ఉంది.. ఇలాంటి తరుణంలో పలు రకాల సర్వేలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటివరకు అన్ని పార్టీలకు సంబంధించి సర్వేలు కూడా విడుదలయ్యాయి.. తాజాగా ఇప్పుడు రైస్ సర్వే చిట్టచివరి ఫైనల్ రిపోర్టును సైతం విడుదల చేసింది.. 9- 5- 2024 రోజున విడుదల చేసింది.. ఈ లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయం ఖాయమని తెలియజేస్తోంది.101-114 స్థానాలు వస్తాయని వైసీపీ పార్టీకి 51--70 స్థానాలు వస్తాయని ఇతరులకు వచ్చే అవకాశాలు ఏమి లేవు అని కూడా వెల్లడిస్తోంది.


టోటల్గా శాంపుల్స్ వచ్చి 2,80,000 తీశామన్నట్లుగా రైస్ సర్వే తెలియజేస్తోంది. 175 నియోజకవర్గాలకు సంబంధించి 0.8 శాతం వరకు ఎర్రర్ ఉండే అవకాశం ఉందని తెలుపుతున్నారు. పార్టీల పరంగా చేసుకుంటే..51.8.8% కూటమికి అని..43.49 వైసిపి పార్టీకని.. ఇతరులకు 4.3% వస్తాయని వెల్లడిస్తోంది. ముఖ్యంగా వైసిపి పార్టీని ఎఫెక్ట్ చేసింది ప్రభుత్వ వ్యతిరేకత, ధరలు పెరుగుదల, విద్యుత్ చార్జీలు, నిరుద్యోగం, లిక్కర్ ధరలు, రోడ్డు లు సరిగ్గా లేకపోవడం, గవర్నమెంట్ ఉద్యోగులు, ఆక్వా రైతులు గోదావరి సైడ్, అమరావతి ప్రజలు, పెట్రోల్ డీజిల్ ధరలు , ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ , ప్రజలకు సెక్యూరిటీ లేకపోవడం వంటి తదితర అంశాలు వీటి పైన చూపించాయంటూ తెలియజేస్తుంది రైస్ సంస్థ.


ముఖ్యంగా టిడిపి సూపర్ సిక్స్ మేనిపోస్ట్ ప్రజలను ఆకట్టుకుందని కూడా వెల్లడించారు.. పెన్షన్లు నాలుగువేలకు పెంచడం .. మూడు సిలిండర్లు అన్నటువంటిది ప్రజలను ఆకట్టుకున్నాయని రైస్ సంస్థ తెలియజేస్తుంది. ఇందుకు కారణం అయ్యాయని కూడా తెలియజేస్తోంది. మరి ఈ నెల 13వ తేదీన ఓటింగ్ జరగబోతోంది.. ఇలాంటి సమయంలో ఈ సర్వే మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురయ్యాలా చేస్తోంది. మరి ఏ మేరకు ఈ సర్వేలో చెప్పిన అంశాలు నిజమవుతాయా లేకపోతే అన్ని సర్వేల లాగా ఫేక్ సర్వేలు అని తేలుతాయి మరో కొద్ది రోజులలో తెలియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: