- పెట్టుబ‌డుల క‌ష్టంలో బాబుకు 100 మార్కులు.. జ‌గ‌న్‌కు 60 మాత్ర‌మే
- వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చాక విశాఖ పెట్టుబ‌డుల స‌ద‌స్సు మిన‌హా ఒరిగిందేలే

( విశాఖ‌ప‌ట్నం - ఇండియా హెరాల్డ్ )

రాష్ట్రానికి ఆదాయం రావాలంటే.. పెట్టుబ‌డులు అతి కీల‌కం. ఈ విష‌యంలో అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా.. జాగ్ర‌త్త‌లు తీసుకుంటాయి. పెట్టుబ‌డులు వ‌చ్చేలా  ప్ర‌య‌త్నాలు చేస్తాయి. త‌ద్వారా ఉపాధి పెర గ‌డంతోపాటు.. నిరుద్యోగుల‌కు ఉద్యాగాలు కూడా ద‌క్కుతాయి. ఇదే ల‌క్ష్యంగా అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా పెట్టుబ‌డుల‌కు పెద్ద పీట వేస్తుంటాయి. అలానే ఏపీ విష‌యాన్ని గ‌మ‌నిస్తే.. గ‌తంలో 2014-2019 మ‌ధ్య పాలించిన చంద్ర‌బాబు పెట్టుబ‌డుల కోసం అనేక ప్ర‌య‌త్నాలు చేసిన మాట వాస్త‌వం.


అనంత‌పురంలో కియా కార్ల కంపెనీ విడిభాగాల త‌యారీ నుంచి విశాఖ‌ను కేంద్రంగా చేసుకుని లూలూ కంపెనీ నుంచి ఎల్జీ వ‌ర‌కు ప‌లు కంపెనీల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేశారు. కొన్ని కంపెనీలు కూడా వ‌చ్చాయి. అయితే..పెట్టుబ‌డులు పెట్టేందుకు త‌గిన వ‌న‌రులు ఏర్పాటు చేయ‌లేద‌ని.. అవినీతి ఆరోప ణ‌లు.. కేంద్రం అనుమ‌తులు ఇవ్వ‌క‌పోవ‌డం వంటివి కూడా.. పెట్టుబ‌డుల రాక‌కు బ్రేకులు వేశాయ‌నే అభిప్రాయం ఉంది. ఇక‌, ఏటా జ‌న‌వ‌రిలో పెట్టుబ‌డుల స‌ద‌స్సును విశాఖ‌లో నిర్వ‌హించారు.


మొత్తంగా చంద్ర‌బాబు చేసిన ప్ర‌య‌త్న‌మే మంచిదే. కానీ, పెద్ద‌గా అప్ప‌ట్లో అయితే రాలేదు. త‌ర్వాత వ‌చ్చినా.. వెళ్లిపోయాయ‌ని.. టీడీపీ నేత‌లు చెబుతున్నారు. ఈ విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం కొన్ని ఆరోప ణ‌లు ఎదుర్కొంది. ఎలా చూసుకున్నా.. చంద్ర‌బాబు ప్ర‌య‌త్నం బాగానే ఉంది. ఇక‌, జ‌గ‌న్ పెట్టుబ‌డుల విష‌యానికి వ‌స్తే.. 4 ల‌క్ష‌ల కోట్ల వ‌ర‌కు పెట్టుబ‌డులు వ‌స్తున్నాయ‌ని.. మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ చెబుతున్నారు. కానీ, ఇప్పటి వ‌ర‌కు ఎవ‌రూ రాలేదు.


ఒకే ఒక్క‌సారి సీఎం జ‌గ‌న్ దుబాయ్ పెట్టుబ‌డుల స‌ద‌స్సుకు వెళ్ల‌డం మిన‌హా.. ఒరిగింది.. జ‌రిగింది.. ఏమీ లేదు. అంటే.. మొత్తంగా చూస్తే.. ఇరు ప్ర‌భుత్వాల‌కు మ‌న‌సు పెట్ట‌లేదన్న భావ‌న క‌లిగింది. ప్ర‌య‌త్నం చేయ‌డంలో చంద్ర‌బాబుకు 100 మార్కులు ప‌డితే.. జ‌గ‌న్‌కు 60 మార్కులే ప‌డ్డాయి. అయితే..ఇ క్క‌డ ఒక కీల‌క విష‌యం చెప్పుకోవాలి. జ‌గ‌న్‌కు పాల‌నా కాలం వ‌చ్చింది కేవ‌లం రెండు సంవ‌త్స‌రాల 11 నెల‌లు మాత్ర‌మే. మిగిలిన స‌మ‌యంలో ఏడాది 11 నెల‌ల‌పాటు క‌రోనా ఫ‌స్ట్‌, సెకండ్ వేవ్‌తోనే కాలం గడిచిపోయింది. ఇక‌, సాధార‌ణ‌, సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో మూడు మాసాలు గ‌డిచిపోయాయి. చంద్ర‌బాబుకు ర‌మార‌మి 58 నెల‌ల కాలం పాల‌న‌కు అందుబాటులోకి వ‌చ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: