టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. దువ్వాడ శ్రీనివాస్ మాధురి అనే మహిళతో సహజీవనం చేస్తూ అక్రమ సంబంధం పెట్టుకున్నారని దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి ఆయన పిల్లలు ఆరోపిస్తున్నారు. అయితే వీరి వ్యవహారం చిలికి చిలికి గాలి వానలా మారినట్టు డిఎన్ఏ టెస్ట్ దాకా వచ్చేసింది.ఇందులో భాగంగా మాధురికి ఉన్న ముగ్గురు పిల్లలు ఎవరెవరికి పుట్టాలో తెలియాలంటే ముగ్గురికి డిఎన్ఏ టెస్ట్ చేయించండి.దాని బాగోతం బయటపడుతుంది అని దువ్వాడ వాణి మీడియ ముఖంగా బయట పెట్టింది. అయితే ఈమె మాటలకు కౌంటర్ ఇస్తూ మాధురి ముందు నీ ఇద్దరు పిల్లలకు డిఎన్ఏ టెస్ట్ చేయించు ఆ తర్వాత నేను నా పిల్లలకు చేయిస్తాను.నా పిల్లల జోలికి వస్తే అస్సలు ఊరుకోను అంటూ ఘాటుగా స్పందించింది. అంతేకాదు నా పిల్లల గురించి నా వ్యక్తిత్వం గురించి మాట్లాడితే మాత్రం చెప్పుతో కొడతాను. తంతాను అంటూ సంచలన కామెంట్లు చేసింది మాధురి. అంతేకాకుండా టెక్కలిలోని ఇంట్లో ఉండకూడదు అని దువ్వాడ వాణి అంటుంటే మాధురి మాత్రం అస్సలు తగ్గట్లేదు.

దాని పేరు మీద ఏమైనా ఇల్లు ఉందా.. ఇంట్లో ఉండకూడదు అని చెప్పడానికి అది ఎవరు? నేను ఆయనకు అప్పు ఇచ్చాను.ఆ అప్పు తీరేంతవరకు ఆ ఇంట్లో నాకు కూడా భాగం ఉంటుంది. ఆ ఇల్లు ఆమెదని ఏమైనా ప్రూఫ్ ఉంటే చూపించమనండి.. నేను శ్రీను గారికి ఎన్నో డబ్బులు ఇచ్చాను. ఆయన అకౌంట్ కి పంపిన ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి అంటూ సంచలన కామెంట్స్ చేస్తుంది.అంతేకాకుండా దువ్వాడ వాణి మందు తాగి ఆ మత్తులో మాట్లాడుతుంది.ఆమెకు అలవాటు ఉంది అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య మాటలు యుద్ధం నడుస్తోంది. వైఎస్ఆర్సిపి పార్టీ తరపున టెక్కలి ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ గడపగడప అనే ప్రోగ్రాం చేస్తున్న సమయంలో మాధురిని కలిశారు. ఆ సమయంలోనే మాధురితో శ్రీనివాస్ కి పరిచయం ఏర్పడి అధికాస్త అక్రమ సంబంధానికి దారితీసింది అని తెలుస్తోంది. ఓ పక్క దువ్వాడ శ్రీనివాస్ ఏమో ఇది అంతా కావాలనే  టిడిపి వాళ్ళు చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.

ఇక మాధురి కూడా ఇక్కడినుండి నన్ను తరిమేయడానికి ఆమె ఎవరు.. ఆమెకు ఎలాంటి హక్కు ఉందని అలా మాట్లాడుతుంది.నేను ఈ విషయంలో న్యాయపరంగా వెళ్తాను. నేను ఇక్కడే ఉంటా.. నన్ను ఎవరు ఏం చేస్తారో చూస్తాను నేను ఎన్నికల టైం నుండి దువ్వాడ శ్రీనివాస్ తోనే ఉంటున్నాను అంటూ తెలిపింది. అంతేకాకుండా దువ్వాడ వాణి కి మెంటల్ అని,ఆమె పెద్ద సైకో అని ఆమెకు టెస్ట్ చేయించండి.ఆమె అర్ధరాత్రులు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఎవరో చూసి దయ్యం అని కూడా భయపడ్డారట.. ఆమెకు మెంటల్ డిజాస్టర్ ఉంది.ఆమెకు సైకలాజికల్ డిజాస్టర్ ఉంది ఆమె రిపోర్ట్స్ చూడండి అంటూ సంచలన కామెంట్లు చేసింది. ఇక చివరికి వాణినా దగ్గరికి వచ్చి క్షమాపణలు చెప్పి నా భర్తతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు పిల్లల్ని అన్నందుకు క్షమించండి అని మీడియా ముఖంగా క్షమాపణలు తెలిపితేనేను శ్రీనివాస్ తో ఉన్న ఫ్రెండ్ రిలేషన్ ని కూడా వదులుకొని విదేశాలకు వెళ్లిపోతాను. ముందు నాకు ఆమె,ఆమె కూతుర్లు నాకు క్షమాపణలు చెబితే నేను శ్రీనివాస్ ఇంటి వైపు కూడా వెళ్ళను. ఆయనతో అన్ని బంధాలు కట్ చేసుకుంటాను అని చెప్పింది.


మరింత సమాచారం తెలుసుకోండి: