- పాఠశాలల అభివృద్ధికి చేయూతనివ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పర్యాయాలు సీఎం కేసీఆర్ పాలించారు. ఈయన హయాంలో ఎన్నో పథకాలు తీసుకువచ్చి వాటిని ఇంప్లిమెంట్ చేశారు. ఇందులో రైతుల కోసం అద్భుతమైన పథకాలు తీసుకొచ్చారు. అలాగే పాఠశాలల అభివృద్ధి కోసం కూడా మన ఊరు మనబడి పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అలా రెండు పర్యాయాలు కేసిఆర్ పాలన తర్వాత మూడవ పర్యాయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో కాంగ్రెస్ పాలనలో కేసీఆర్ తీసుకొచ్చినటువంటి ఎన్నో పథకాలను మార్పు చేసే దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇప్పటికీ అనేక పథకాల పేర్లు మార్చేసింది. ఇదే తరుణంలో మన ఊరు మనబడి పేరుతో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల స్కీమును అమ్మ ఆదర్శ పాఠశాలలుగా మార్చేసింది. ఈ పాఠశాలకు మహిళల నుంచి ఒక కమిటీని ఎంపిక చేసి పాఠశాలలకు చైర్మన్ గా నియమించింది. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో ఉన్నటువంటి చైర్మన్లు, కింది కమిటీ ఏ పనులు చేయాలి. పాఠశాలను ఎలా అభివృద్ధి చేయాలి అనే వివరాలు చూద్దాం.
అమ్మ ఆదర్శ పాఠశాలతో అభివృద్ధి తథ్యం:
మన ఊరు మనబడి పేరుతో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి స్కీమును అమ్మ ఆదర్శ పాఠశాలలుగా నామకరణం చేశారు రేవంత్ సర్కార్. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో కమిటీ ఏర్పాటుకు ఇక నిబంధనలు ఉన్నాయి. కమిటీలో ఉన్న వారికే పాఠశాలకు సంబంధించిన అకౌంట్ మైంటైన్ చేసే అర్హత ఉంటుంది. ఈ కమిటీలో ఉన్న వారే పాఠశాలలోని అన్ని వసతులు కల్పించే విధంగా ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా టాయిలెట్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ గాని, స్కూల్లో విద్యుద్ధికరణ, చిన్న చిన్న రిపేర్లు, సానిటేషన్, సోలార్ ఇలా స్కూలుకు సంబంధించిన అన్ని సమస్యలను తీర్చుకుంటూ రావాలి. పాఠశాల ప్రారంభానికి ముందే యూనిఫార్మ్స్ స్టిచ్చింగ్ చేయించడం వంటి కార్యక్రమాలు నిర్వహించాలి.
కమిటీ ఏర్పాటు ఎలా?
కమిటీలో విలేజి సంబంధించినటువంటి ఏరియా లెవెల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కమిటీకి చైర్ పర్సన్ గా ఉంటారు. వీరితోపాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ కమిటీకి కన్వీనర్ గా ఉంటారు. ఇంతకుముందుకు చైర్మన్ ఒక్కరే ఉండేవారు కానీ ఇప్పుడు అలా కాకుండా చైర్ పర్సన్ నియమించారు. ఈ కమిటీని ప్రతి సంవత్సరం మారుస్తూ ఉండాలి. ఈ కమిటీలో మెంబర్స్ గా కూడా పాఠశాలలు చదివేటువంటి విద్యార్థుల తల్లులను మాత్రమే తీసుకోవాలట. అయితే ఇందులో తీసుకునేది కూడా మహిళా సంఘాలలో సభ్యురాలు అయి ఉంటే వారిని ఎంపిక చేస్తూ ఉంటారు. ఒకటో తరగతి నుంచి మొదలు టెన్త్ క్లాస్ వరకు ఒక్క తరగతికి ముగ్గురు సభ్యులను తీసుకోవాలి. అది కూడా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచే ఒకరిని ఎంచుకోవాలి. ఈ విధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఎన్నుకున్న తర్వాత పాఠశాల అభివృద్ధికి సంబంధించిన ప్రతి విషయం వారే చూసుకుంటారు. ముఖ్యంగా తరగతి గదుల్లో ఫ్యాన్లు లైట్లు ఏవైనా పాడైతే వాటిని వేయించడం, అంతేకాకుండా తరగతి గదులకు కలర్స్ వేయించడం. స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం వంటివి బాధ్యతలు తీసుకుంటారు. ఈ విధంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మన ఊరు మనబడి పేరుతో ఉన్నటువంటి ఈ పేరును అమ్మ ఆదర్శ పాఠశాలలుగా మార్చి ఎన్నో అభివృద్ధి పనులకు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి