ఆ దేశ సైనికులు అక్కడే నక్కేందుకు బంకర్లను నిర్మించుకున్నారని సమాచారం అందుతోంది. ఆ బంకర్లను సైతం ధ్వంసం చేసే దిశగా భారత ఆర్మీ అడుగులు వేస్తుండటం గమనార్హం. ఇందుకోసం యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అనే ప్రత్యేకమైన ఆయుధాన్ని భారత్ వాడుతోంది. భారీగా సాయుధ కవచాలతో డిజైన్ చేసిన వాహనాలను ధ్వంసం చేయడం కోసం ఈ మిసైల్ ను వినియోగించడం జరుగుతుంది.
ఒక్కసారి ఈ మిసైల్ లో టార్గెట్ ను లాక్ చేస్తే అదే లక్ష్యాన్ని వెంటపడి చేధించడం జరుగుతుంది. వాహనాలపై అమర్చి లేదా భుజం పై నుంచి ఈ ఆయుధాన్ని ప్రయోగించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఆయుధాలలో సాధారణంగా షేపుడ్ ఛార్జ్ అనే దానిని వినియోగించడం జరుగుతుంది. రెండేసార్లు పేలుళ్లు జరిగేలా ఇందులో వార్ హెడ్లు ఉంటాయి.
అన్ని రకాల పరిస్థితుల్లో పని చేసే విధంగా వీటిని తయారు చేశారని తెలుస్తోంది. వీటిలో కొన్నింటికి టాప్ అటాక్ మోడ్ ఉంటుందని సమాచారం అందుతోంది. ఇజ్రాయెల్ వద్ద మాత్రం ట్రోఫీ అనే ప్రత్యేక వ్యవస్థ ఉందని ఇది ట్యాంకర్ పైకి వచ్చే క్షిపణులను ముందే గుర్తించి పేల్చేస్తుందని తెలుస్తోంది. ఈ వ్యవస్థలు చాలా వేగంగా, స్మార్ట్ గా పని చేస్తాయని సమాచారం అందుతోంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి