కొన్ని రోజుల క్రితం భారతదేశానికి సంబంధించిన అమాయకమైన వ్యక్తులను పాకిస్తాన్ కి సంబంధించిన కొంత మంది ఉగ్రవాదులు అనవసరంగా చంపివేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈ విషయాన్ని భారత ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఎలాంటి అన్యం పుణ్యం ఎరగని భారతీయుల ప్రాణాలను అనవసరంగా పొట్టన పెట్టుకున్న ఆ ఉగ్రవాదులను ఎలాగైనా మట్టు పెట్టించాలి అని భారత ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. అందులో భాగంగా పెద్ద ఎత్తున ప్రణాళికలను రూపొందించి ఒక్క సారిగా ఉగ్రవాద స్థావరాలపై పెద్ద ఎత్తున దాడి చేస్తుంది. ఇక ఉగ్రవాదులు తేరుకొనేలోపే వారిలో అనేక మంది ప్రాణాలు పోయాయి.

ఇక వీరంతా పాకిస్తాన్ ఉగ్రవాదులు అయినప్పటికీ పాకిస్తాన్ వారు మాత్రం ఆ ఉగ్రవాదులకు మాకు ఎలాంటి సంబంధం లేదు. భారత్ చేసిన దాడుల వల్ల ఉగ్రవాదులతో పాటు మా దేశానికి సంబంధించిన అనేక మంది అమాయకులు కూడా చనిపోయారు. ఈ విషయాన్ని మేము కూడా చాలా సీరియస్ గా తీసుకున్నాం. మేము కూడా భారత్ పై దాడి చేస్తాం అని ప్రకటించారు. చెప్పిన విధంగానే వారు కూడా భారత్ పై ఇప్పటికే దాడులను చేయడం మొదలు పెట్టారు. ఇకపోతే ఇలా భారత్ - పాక్ మధ్య ప్రస్తుతం పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్న నేపథ్యంలో వీటిని ఎలాగైనా ఆపేయాలి అనే ఉద్దేశంతో పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి అయినటువంటి నవాజ్ షరీఫ్ రంగం లోకి దిగినట్లు సమాచారం.

ప్రస్తుత భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీకి , పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి అయినటువంటి నవాజ్ షరీఫ్ కి మంచి సన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలో ఈరు దేశాల దూకుడును తగ్గించి పరిస్థితిని చక్కదిద్దాలి అని షరీఫ్ భావిస్తున్నట్లు , ఆయన ఇప్పటికే భారత్ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారు అని పాక్ మీడియా పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: