
అంతలోనే ఇంత విషాదం జరగడంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఆపరేషన్ సింధూర్ లో ఈయన ప్రాణాలు విడవడంతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఇక మురళి నాయక్ తల్లిదండ్రులను సీఎం చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. దేశ రక్షణలో సైనికుడు మురళీ ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇక దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళికి నివాళులర్పిస్తున్నట్లు కూడా తెలిపారు.
మురళి నాయక్ కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే మంత్రి సవిత కల్లి తండాకు వెళ్లి జవాన్ తల్లిదండ్రులను ఓదార్చారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5లక్షల చెక్కును మురళి నాయక్ తల్లిదండ్రులకు ఆమె అందజేశారు. ఏది ఏమైనా కష్టకాలంలో ప్రభుత్వం అండగా నిలిచింది. కానీ జవాన్ దేశ ప్రజలను కాపాడడానికి వీర మరణం పొంది అందరిని దుఃఖంలో ముంచేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. పలువురు సెలబ్రిటీలు, ప్రజలు మురళి నాయక్ మరణానికి సంతాపం తెలియజేస్తూ.. వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు.