శనివారం రోజు పాక్ భారత్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది అని,ట్రంప్ ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిపారు అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా బయటపెట్టారు. దీంతో భారత్ పాక్ యుద్ధం ముగిసిపోయింది అని చాలామంది సంబరపడిపోయారు.ఇక పాకిస్తాన్ ప్రజలైతే హమ్మయ్యా అంటూ ఊపిరి పిలుచుకున్నారు. కానీ ఇంతలోనే పాక్ తన దొంగ బుద్ధి చూపించింది. చీకటి పడడంతోనే మళ్లీ డ్రోన్లని,మిస్సైల్ లను పంపించింది. కానీ పాకిస్తాన్ దొంగబుద్ధి ఏంటో తెలిసిన ఇండియన్ ఆర్మీ నిఘా పెట్టింది.దాంతో పాకిస్తాన్ నుండి వచ్చిన డ్రోన్లని కూల్చివేసింది. అయితే ఉన్నట్టుండి పాకిస్తాన్ ఎందుకు భారత్ కాళ్లబేరానికి వెళ్ళింది.. యుద్ధం ఆపేయాలని ఎందుకు అనుకుంది అనేది చాలామందికి తెలియదు. కానీ పాకిస్తాన్ భారత్ కాళ్లబేరానికి వెళ్లడానికి కారణం ఐఎంఎఫ్ దగ్గర నుండి వచ్చే అప్పు కోసమే నట.. తాజాగా అంతర్జాతీయ ద్రవ్య నిధిని పాకిస్తాన్ అప్పు అడిగిన సంగతి మనకు తెలిసిందే. 

ఇక పాకిస్తాన్ అడిగిన అప్పు మంజూరు చేస్తూ వన్ బిలియన్ యూఎస్ డాలర్లు అంటే 8500 కోట్ల రుణాన్ని ఇచ్చేందుకు ఐఎంఎఫ్ ముందుకు వచ్చింది.కానీ ఈ విషయంలో భారత్ ఐఎంఎఫ్ ని తప్పు పట్టింది. పాకిస్తాన్ దుర్వినియోగం చేయడం కోసమే ఆ అప్పు తీసుకుంది అని,పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది అని,ఉగ్రవాదుల కోసమే ఈ అప్పు తీసుకుంది అంటూ ఒక ఇష్యూ బయటికి తీసింది.అంతేకాదు పాకిస్తాన్ కి ఇచ్చే రుణానికి ఓటింగ్ బహిష్కరిస్తామని ఇండియా షాకింగ్ డేసిషన్ తీసుకోవడంతో వెంటనే అప్రమత్తమైన పాకిస్తాన్ అప్పు ఎక్కడ రాకుండా పోతుందోనని భయపడి చివరికి యుద్ధం నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటన చేసింది. అయితే పాకిస్తాన్ కి ఐఎంఎఫ్ ఇచ్చే రుణం విషయంలో భారతదేశం వ్యతిరేకించిన కూడా ఐఎంఎఫ్ మాత్రం పాక్ కి 8500 కోట్ల అప్పులు ఇవ్వడానికి అంగీకరించింది.

కానీ ఈ విషయంలో అప్పు ఇచ్చే టైంలో కొన్ని షరతులు విధించారట. అదేంటంటే రుణం ఇస్తాం కానీ మీరు కాల్పుల విరమణ ప్రకటించాలని, అలా ప్రకటిస్తేనే అప్పు ఇవ్వడానికి రెడీ అంటూ ఐఎమ్ఎఫ్ తెలియజేయడంతో అప్పు ఎక్కడ రాకుండా పోతుందోననే భయంతో పాక్ భారత్ కాళ్లబేరానికి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఐఎంఎఫ్ నుండి లోన్ రావాలి అంటే కచ్చితంగా అమెరికా అనుమతి ఉండాలి. కానీ అమెరికా యుద్ధాన్ని ఆపమని చెబుతోంది. దీంతో అప్పు ఎక్కడ రాదో అనే భయంతో అమెరికా పెట్టిన షరతు కి పాకిస్తాన్ తలొంచి భారత్ కాళ్లబేరానికి వెళ్లి యుద్ధం ఆపేసినట్టు చెప్పింది.కానీ అంతలోనే మళ్లీ పాకిస్తాన్ దొంగబుద్ధి చూపించి కాల్పుల విరమణ ని ఉల్లంఘించి ఇండియన్ ఆర్మీ పై కాల్పులు చేసింది.కానీ దీన్ని ఇండియన్ ఆర్మీ తిప్పి కొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: