
ఇక దీంతో వంశీని వెంటనే స్థానిక ప్రభుత్వ హాస్పటల్‌కు తరలించారు . వంశికి ప్రస్తుతం వైద్యం అందిస్తున్నారు. ఈ విషయం బయటకు రావడంతో ఆసుపత్రి వద్దకు వైసిపి వర్గాలు భారీగా చేరుకున్నారు . అలాగే వంశీ ఆరోగ్యం పై ఆరా తీస్తున్నారు .. కాగ గన్నవరం కు చెందిన సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో ఆయనకు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే .. అయితే గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడి చేసిన కేసులో మాత్రం ఆయన రిమాండ్ ఖైదీ గానే ఉన్నారు .. ఇక దీంతో ఇంకా జైల్లోనే వల్లభనేని వంశీ ఉన్నారు .. ఇక ఈ సమయంలో వల్లభనేని వంశీ అస్వస్థతకు గురికావడంతో వైసీపీ నేతలో గందరగోళం మొదలైంది .
కోర్టు ఇచ్చిన ఆదేశాలతో జైలు అధికారులు వంశీని గత సాయంత్రం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రకు తీసుకువెళ్లారు మొదటి అంతస్తులో ఉన్న రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ ఛాంబర్ లో వైద్యులు వంశీ రక్త నమోనాలను తీసుకున్నారు బీపీ, షుగర్, ఈసీజీ, సిటీ స్కాన్ పరీక్షలు కూడా చేశారు .. ఆయనకు ఎక్కువగా పొడి దగ్గు వస్తున్నట్లు కూడా గుర్తించారు .. అయితే సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో వావల్లభనేని వంశీ తో పాటు మరో ఐదుగురికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది .. అయితే గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడి కేసులో మాత్రం ఇంకా ఆయనకు బెయిల్ రాకపోవడంతో వంశీ ఇంకా జైల్లోనే ఉంటున్నారు .