
అయితే ఈ ఘటన గురించి ప్రశ్నలు వ్యక్తం కాగా ఇదంతా వైసీపీ చేయిస్తోందని టీటీడీ బోర్డు సభ్యుడు కామెంట్లు చేశారు. తాజాగా ఏఆర్ పోలీసులు తిరుమలలో తప్ప తాగి నానా యాగీ చేశారు. తిరుమలలో అపశ్రుతులు ప్రతి వారం జరుగుతుండటంపై ప్రజల నుంచి సైతం ప్రశ్నలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
తిరుమలలో పాలనా వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని తిరుమల ప్రతిష్ట మసకబారేలా అధికారుల తీరు ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తిరుమలలో సెక్యూరిటీ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కూటమి సర్కార్ తిరుమలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. భక్తి శ్రద్ధలతో వ్యవహరించే వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది.
ప్రపంచ దేశాల నుంచి భక్తులు వచ్చి తిరుమలను ప్రతి సంవత్సరం దర్శించుకుంటారు. తిరుమల పవిత్రతను దెబ్బ తీసేలా వ్యవహరించే ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తిరుమలలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు