నిరంతరం పొలిటికల్ కు సంబంధించి పలు రకాల సర్వేలు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. మరొకవైపు విశ్లేషకులు సైతం తమ అభిప్రాయాలను కూడా ఎప్పటికప్పుడు పంచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఫలానా ఎమ్మెల్యే ఫలానా సీఎం వెనుకబడ్డారని, వ్యతిరేకత ప్రభుత్వం పైన ఉందంటూ ఇప్పటికే చాలా సందర్భాలలో చాలామంది తెలియజేశారు. అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక సర్వే తెగ హల్చల్ చేస్తోంది. అది కూడా దేశంలోనే టాప్ పర్సనాలిటీ పేరుతో కొనసాగుతున్న ఇద్దరు నేతల మధ్య వార్ ఇప్పుడు సర్వేగా మారి ఏపీ అంతట సర్కులేట్ అవుతోంది.


ఇక వారు ఎవరో కాదు వైసిపి పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. జనసేన పార్టీ అధినేత ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 2024 కూటమిలో భాగంగా జనసేన పార్టీ చాలా కీలకంగా మారింది. దీంతో తమకు విజయాన్ని కూడా చేకూర్చుకున్నారు పవన్ కళ్యాణ్. అలా జాతీయస్థాయిలో కూడా కొన్ని ప్రాంతాలలో బిజెపి పార్టీకే సపోర్టుగా నిలబడ్డారు పవన్ కళ్యాణ్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా వైసిపి పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.


అయితే ఇటువంటి సమయాలలోనే గ్లోబుల్ బాక్స్ ఆఫీస్ అనే ఒక సర్వే ఈనెల 21 నుంచి 28వ తేదీ వరకు ఒక సర్వేని సోషల్ మీడియాలో తీసుకువచ్చింది. ఇందులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ సీఎం జగన్ ఉద్దేశించి ఎవరికి ఎక్కువ ప్రజాదారణ ఉందో అన్నట్టుగా సర్వే చేపట్టారు.అయితే ఇందులో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి 63% మంది సపోర్టివ్ గా చేయగా ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు 37% మంది మాత్రమే మద్దతు తెలిపినట్లు ఈ సర్వే తెలియజేస్తోంది. దీంతో జనసేన నేతలు కార్యకర్తలు ఇది ఫేక్ సర్వే అంటూ కొట్టి పారేస్తున్నారు.. వైసీపీ మాత్ర ప్రజాదారన తమ నేతను మించిన వారు లేరు అంటూ తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: