వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాలంటరీ వ్యవస్థకు ఆయువుపట్టుగా ఉండేది. ఐదేళ్లపాటు వాలంటిరీలహవా బాగా కొనసాగింది. ఒక్కొక్కరికి 5000 రూపాయలు చొప్పున గౌరవ వేతనం చెల్లించింది ఏపీ ప్రభుత్వం. అలా 50 ఇళ్లకు ఒక వాలంటీర్లను నియమించి మరి ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలను అందించారు. ఒక విధంగా ఈ ప్రయత్నం మంచిదే అయినప్పటికీ రాజకీయ జోక్యం వల్ల వాలంటీర్ల వ్యవస్థ కేవలం వైసీపీ వాలంటరీ వ్యవస్థలే అన్నట్లుగా మారిపోయింది. ఈ వాలంటరీ వ్యవస్థ మీద కూడా బలమైన రాజకీయం ముద్ర పడిపోయింది.


వైసిపి అధినాయకత్వం  వాలంటీర్ల వల్ల పూర్తిగా కార్యకర్తలను నిర్లక్ష్యం చేశారు.. వీటికి తోడు 2024 ఎన్నికల నాటికి కార్యకర్తలని అసలు పట్టించుకోలేదు. ఇక అప్పటి ప్రతిపక్షంగా ఉన్న టిడిపి ఏకంగా వాలంటీర్లను ఎన్నికల ముందు దూరం  పెట్టేలా చేశారు. వాలంటిరీలకు కూడా రూ .10 వేల రూపాయలు తాము అధికారంలోకి వస్తే చెల్లిస్తామని  చెప్పడంతో ఆశపడి కూటమికి ఓటు వేశారు.. అయితే గెలిచిన తర్వాత  ఆ పూసే ఎత్తకుండా అసలు వాలంటరీ వ్యవస్థ రెన్యువల్ చేయలేదంటూ పూర్తిగా తొలగించేశారు.


ఇలాంటి తరుణంలో ప్రస్తుతం వైసీపీ పార్టీ కూడా వాలంటీర్ల ఉసే ఎత్తడం లేదని కేవలం అధికార కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతూ ఉన్న వాలంటరీలను తిరిగి తీసుకోలేదు.. దీంతో సుమారుగా 2,50 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. అయితే ఈ తప్పును కూడా వైసిపి పార్టీ మీదికి తోసేసింది కూటమి ప్రభుత్వం. అప్పట్లో వీరిని రెన్యువల్ చేయలేదంటూ తెలియజేశారు. అలా కొన్ని రోజుల పాటు వాలంటరీలు కూడా ఉద్యమం చేపట్టిన ఎక్కడా కూడా మద్దతు పెరగలేదు. మాజీ సీఎం జగన్ అయితే అధికారంలోకి వస్తే కేవలం కార్యకర్తల కోసమే పనిచేస్తుందని జగన్ 2.O అన్నట్టుగా తెలియజేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే వాలంటరీ వ్యవస్థకు వైసిపి కూడా శుభం కార్డు పలికినట్టే అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: