- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

ఆంధ్రప్రదేశ్లో కోటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటుతుంది. ఈ యాడాదిలో కూటమి పాలనపై ప్రజల్లో భిన్నాభిప్రాయం వచ్చేసింది. కూటమి గ్రాఫ్ పడిపోతుందన్న సంకేతాలు .. సందేశాలు వస్తున్నాయి. ఎక్కడైనా పాలనకు వ్యతిరేకంగా ఎన్నికలు జరుగుతాయి .. ప్రజా తీర్పు కూడా పాలనపై ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఎమ్మెల్యేల గురించి వారి నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలను అడిగితే వచ్చే ఎన్నికలలో ఫస్ట్ ఓడిపోయేది మా ఎమ్మెల్యే అనే ఎక్కువమంది చెప్తున్నారు. చాలామంది ఎమ్మెల్యేలు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని అత్యాశకు పోతున్నారు. భారీగా అవినీతి .. అక్రమాలకు పాల్పడుతున్నారు. తమను గెలిపించిన ప్రజలకు ఏదైనా మంచి చేయాలన్న ఆలోచన చాలా తక్కువ మంది ప్రజాప్రతినిధులకు మాత్రమే ఉన్నట్టు కనపడుతుంది. ఇలాంటి వాళ్ళని చూసిన ప్రజానికం అధికారంతో తమకు నష్టం చేయకపోతే అదే ప‌ది వేలు అని ప్రజలు భావించే పరిస్థితికి వచ్చేసారు.


చివరకు ఏపీలో కొందరు ఎమ్మెల్యేల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే అరాచకాలను .. దోపిడీలను ప్రశ్నిస్తే తన మన పరా అని కూడా చూడటం లేదు. సొంత పార్టీ వాళ్ళను సైతం లేపేయడానికి వెనుకడటం లేదన్న విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. అన్ని తెలిసి కూడా పాలకులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఏది ఏమైనా ఏడాదికే ఫలానా ఎమ్మెల్యే ఎట్టి పరిస్థితుల్లో గెలవడు అంటున్నారంటే ? మరో నాలుగేళ్లు వీళ్ళని భరించాల్సి ఉంటుంది. ఎటు గెలవలేం ... వచ్చే ఎన్నికలలో టిక్కెట్ కూడా రాదు అన్న నిర్ణయానికి వస్తే అలాంటి ఎమ్మెల్యేల ఆగడాలను ఆప తరమా అంటే ఈ ప్రశ్నకు అసలు ఆన్సర్లే లేవు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: