గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై ఎన్నో అనుమానాలు బయటపడుతున్నాయి.. ఈ విమాన ప్రమాదంలో కుట్రా కోణం కూడా ఉంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు.. అంతేకాదు రీసెంట్ గానే పాకిస్తాన్ ఇండియా మధ్య వార్ జరగడం కారణంగా ఇందులో పాకిస్తాన్ హస్తం ఏదైనా ఉందా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు.రీసెంట్ గానే పహల్గామ్ లో జరిగిన అటాక్ తర్వాత ఇండియా ఆపరేషన్ సిందూర్ పేరిట ఉగ్ర మూకల స్థావరాలపై ఉగ్ర దాడి చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంపై కూడా పాకిస్తాన్ కుట్రలు ఏమైనా ఉన్నాయా..పాకిస్తాన్ హస్తము ఉందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ పాకిస్తాన్ హస్తము ఉందా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు.ఇక అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో దాదాపు 242 మంది ఉన్నారు. వీరిలో విమానంలో ఉన్న వాళ్ళందరూ అంటే 242 మంది చనిపోయినట్టు చెబుతున్నారు. ఇందులో ఎంతో మంది వివిఐపీలు,వీఐపీలు,మాజీ సీఎం ఇలా ఎంతోమంది ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే కుప్పకూలిన విమాన ప్రమాదానికి సంబంధించి ఎన్నో షాకింగ్ విషయాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి.. అయితే ఎప్పటిలాగే ఈ విమానం టేకాఫ్ అయినా కొద్దిసేపటికే కుప్పకూలి భారీ మంటలు ఎగిసిపడ్డాయి.

దాంతో ఒక్కసారిగా చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారట. ఇప్పటికే ఈ విమాన ప్రమాదానికి సంబంధించి అధికారులు టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.అంతేకాదు ఈ ప్రమాదం జరిగే ముందు విమాన పైలట్ ఏటీసికి మేడే కాల్ కూడా చేసినట్టు అధికారులు గుర్తించారు. పైలెట్ మేడే కాల్ చేసిన కొద్దిసేపటికి ఏసిటీ సిబ్బంది పైలెట్ కి కాల్ చేయగా వాళ్ళ నుండి ఎలాంటి స్పందన రాకపోవడం గమనించారు. కానీ ఆ తర్వాత కొద్దిసేపటికే విమానం క్లాష్ అయినట్టు సమాచారం అందింది. ఇక విమాన ప్రమాదానికి గల కారణాలు బయటపడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: