
కొన్ని సంస్థలు అప్పు చెల్లించని పక్షంలో ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా ఆస్తులను స్వాధీనం చేసుకోవడం చేస్తున్నాయి. ఈ తరహా అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు 50 రోజుల క్రితం ఉదయనిధి స్టాలిన్ శాసన సభలో చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం బలవంతంగా అప్పు వాసులు చేసినా అప్పు తీసుకున్న వ్యక్తుల ఆస్తులను స్వాధీనం చేసుకున్నా 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 5 లక్షల రూపాయల జరిమానా విధించనున్నారు.
బలవంతంగా అప్పు వసూలు చేయడం వల్ల ఋణం తీసుకున్న వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడితే ఋణం ఇచ్చిన సంస్థ బలవన్మరణానికి ప్రేరేపించినట్టు ప్రభుత్వం భావిస్తుంది. అలాంటి వ్యక్తులకు బెయిల్ సైతం లభించని విధంగా ఈ బిల్లు రూపొందింది. అయితే ఈ బిల్లు వల్ల కొన్నినష్టాలూ కూడా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ రూల్స్ వాళ్ళ సమయానికి ఋణం అందని పరిస్థితి ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు.
తమిళనాడు సర్కార్ అమలు చేసిన ఈ నిబంధనలను ఇతర రాష్ట్రాలు సైతం ఫాలో అవుతాయేమో చూడాల్సి ఉంది. ప్రస్తుత కాలాల్లో చాలామంది అప్పుపై ఆధారపడుతున్న పరిస్థితి నెలకొంది. పెద్దపెద్ద వ్యాపారవేత్తలు సైతం తమ వ్యాపారాలను సక్సెస్ చేయడం కోసం బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది. తమిళనాడు సర్కార్ బిల్లు గురించి ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.