
"కరువు సీమకు పచ్చని తోరణాలు" అంటూ టీడీపీ అనుకూల పత్రికలో తాజాగా ఒక కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఉమ్మడి అనంతపురం జిల్లా దేశంలో అత్యంత కరువు జిల్లాలలో ఒకటి కాగా కొన్నేళ్ల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ జిల్లాలో బిందు సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నాయి. హంద్రీ నీవా ప్రాజెక్ట్ వల్ల అనంతపురం సస్యశ్యామలంగా మారుతోంది. ఎస్కెయూలో మియావాకి దిశగా అడుగులు వేయడంతో జిల్లాలో మరింత పచ్చదనం పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి .
తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలను అడవులలా పెంచే జపాన్ పద్దతిని మియావాకి అని అంటారు. ఈ విధానం ద్వారా మొక్కలు వేగంగా పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. 2019 నవంబర్ లో ఏపీ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఎస్కెయూలోని బొటానికల్ గార్డెన్ లో పరిశోధనలు చేపట్టారు. మొత్తం 152 జాతుల మొక్కలు కాగా జగన్ సర్కార్ హయాంలో ఈ పనులు జరిగాయి కాబట్టి జగన్ ఒకింత గొప్ప పని చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఈ క్రెడిట్ జగన్ కంటే ఎక్కువగా ఈ దిశగా అడుగులు వేసిన శాస్త్రవేత్తకు చెందుతుంది. ఎస్కెయూ వృక్ష శాస్త్ర విభాగాధిపతి రవిప్రసాదరావు ఈ పరిశోధనలకు సారథ్యం వహించారు. ఎకరాను 12 సెక్టార్లుగా విభజించి ఒక్కో సెక్టార్ లో 128 చొప్పున మొక్కలు నాటారు. మొక్కల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంచడంతో పాటు స్థానిక జాతులను ఎక్కువగా పెంచడం వాళ్ళ సత్ఫలితాలు వస్తాయని వెల్లడైంది.