ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు కూడా మనవాళ్లు, మన శత్రువులు అన్న కాన్సెప్ట్ తోనే నడుస్తూ ఉంటాయ అన్న విషయం కొన్ని సందర్భాలలో జరిగిన రాజకీయ సంఘటనలు చూస్తే అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు వైసీపీ నేత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె.. ఏపీలో విశాఖపట్నంలో రిసార్టులు కట్టడానికి లోపల దాకా పునాదులు వేసిందనే వాటి మీద ఇప్పటికే పెద్ద రచ్చ కొనసాగుతోంది. కోర్టు కేసులు దానిమీద సీజ్ చేయడం వంటివి చూసే ఉన్నాము. కోర్టు కూడా ఫైర్ కావడం వంటివి జరిగింది. అయితే అదంతా పడగొట్టమనడం అలాగే అందుకు ఖర్చు కూడా ఆమె దగ్గర తీసుకోమనడం వంటివి జరిగింది.


అయితే ఇప్పుడు ఇక్కడ బాపట్ల దగ్గర.. ఈపురుపాలెం దగ్గర గత వారం పది రోజుల నుంచి పలు టీవీ చానల్స్ లో కూడా బ్రేకింగ్ వస్తూ ఉన్నాయి.. సముద్రం లోపలికి వేస్తున్నారు పునాదులు.. అక్కడ ఉన్నటువంటి రిసార్ట్ నిర్మాణానికి సంబంధించి ఎల్ షేప్ లో కాలువ ఉంటే వాటిని కూడా మార్చిపడేస్తున్నారు.. పునాదులు లోపలికి కూడా వేసేస్తున్నారట.సముద్రం లోపలికి అన్నట్టుగా అక్కడ లోకల్ చానల్స్ లో ఒక పెద్ద రచ్చ చేస్తున్నారు.


ఈ విషయం పైన మత్స్యకారుల ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారట. అయితే టీవీలలో వచ్చిన కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. అయినప్పటికీ కూడా మత్స్యకారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కాలవ ఉన్నదాన్ని మార్చేస్తామంటె ఊరుకోము.. ఎల్ షేప్ లో కాలువ ఉండాల్సిందే.. లేకపోతే ఉద్యమం ఉద్రిక్తతం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారట. దీంతో ఇప్పుడైనా అసలు ఏపీ ప్రభుత్వం ఆ వైపుగా చూస్తుందా అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న? అసలు అక్కడ ఏం జరుగుతోంది?. సముద్రంలోపలికి పునాదులు వేయడం ఓకేనా.. ఇక్కడ రిసార్ట్స్ ఓకే అంటే మరి అక్కడ తప్పెటవుతుంది అంటే చాలామంది ప్రశ్నిస్తున్నారు.. అయితే విశాఖలో చేసింది విజయసాయిరెడ్డి కూతురు ప్రత్యర్థులు కాబట్టి తప్పు.. ఇక్కడ కూటమి కి  సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు కాబట్టి కరెక్ట్ అన్నట్టుగా వ్యవహరించడం జరుగుతోందట.. మరి వీటి పైన ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: