- ( ద‌క్షిణ తెలంగాణ‌ - ఇండియా హెరాల్డ్ )

ఓరుగులు కాంగ్రెస్ వర్గ పోరు పంచాయితీలో అదిరిపోయేట్టు ట్విస్ట్‌ చోటు చేసుకుంది. గాంధీభవన్లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఎదురైన ఎదుటి హాజరైన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి రివర్స్‌లో వరంగల్ జిల్లా పార్టీ నేతలపై ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఎవరు అయితే తనపై విమర్శలు చేస్తున్నారో ? వారిపైనే కమిటీకి కొండా మురళి ఫిర్యాదు చేశారు. కడియం శ్రీహరి - ప్రకాష్ రెడ్డి - హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి పై ఆయన క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. మొత్తం 15 పేజీలతో కొండా మురళీ నివేదిక ఇచ్చారు. స్టేషన్ ఘన్‌పూర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఇందిరను కడియం ఇబ్బంది పెడుతున్నారని ... ఇక పరకాల నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి రేవూరి సహకరిస్తున్నారని ఆరోపించారు. వీళ్ళిద్దరితోపాటు నాయిని రాజేందర్ రెడ్డి పేర్లను కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ముగ్గురి పై చర్యలు తీసుకోవాలని ఆయన క్రమశిక్షణ కమిటీని కోరారు. ఈ నివేదికను కమిటీ స్వీకరించింది.


ఇక కమిటీ ముందుకు రావాలని తనను ఎవరూ పిలవలేదని పార్టీ మీద గౌరవంతో తానే వచ్చానని .. వచ్చే ఎన్నికలలో భూపాలపల్లి నుంచి తన పోటీ చేయాలని అనుకుంటున్నట్టు మురళీ తెలిపారు. ఇక కొండా సురేఖ - సీత‌క్క కలిసి పనిచేసుకుంటున్నారు. సీత‌క్క తో మాకు పంచాయతీ లేదు .. వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని కడియం ప్రచారం చేస్తున్నారని కడియం కాంగ్రెస్లోకి వచ్చినప్పటి నుంచే సమస్యలు మొదలయ్యాయని ఆ లేఖలో పేర్కొన్నారు. హ‌నుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి పెద్ద పెద్ద సెటిల్మెంట్లు చేస్తున్నారు .. మా నియోజకవర్గంలో పోస్టులు ఇప్పించుకుంటున్నారని ఆరోపించారు. ఇక వేం నరేందర్ రెడ్డి సీటు ఎగిరిపోవడానికి తానే కారణమని తనపై కోపంగా ఉన్నట్టు ఉన్నాడు అని తెలిపారు. జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి కొండా మురళి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వరంగల్ కాంగ్రెస్లో చిచ్చురాజేశాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: