గత ఐదేళ్లూ వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకత్వం పై బూతులతో నోరు పారేసుకున్న కొడాలి నాని, నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ కనిపించకుండాపోతూ, మౌనంలోకి వెళ్లిపోయిన తీరు ఆసక్తికరంగా మారింది. “నాడు తాచుపాములా బుసలు .. నేడు దాక్కున్న దొంగలా మౌనం ?” అనే విమర్శలు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి. 2019 నుంచి 2024 వరకు చంద్రబాబు , లోకేష్ పైన బూతుల దాడులు , వ్యక్తిగత విమర్శలు , అసభ్య కామెంట్లు చేసిన వారీలో, కొడాలి నాని ముందుండేవారిలో ఒకరు. గుడివాడ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతగా, పలు కార్యక్రమాల్లో తీవ్ర భాషను ఉపయోగిస్తూ పబ్లిక్‌ ఫోరమ్‌లో నడుస్తూ ఉండేవారు . అప్పట్లో మీడియా కూడా “కొడాలి కామెంట్స్ - క్రేజీ కంటెంట్” అన్నట్టుగా కనిపించేది.


ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ నేత లోకేష్ పర్యటించినప్పుడు తీసుకువచ్చిన "రెడ్ బుక్" వివాదం అప్పట్లో కలకలం రేపింది. అందులో మొదటి పేరుగా కొడాలి నాని ఉంటాడన్న ఊహాగానాలు పటాపంచలయ్యాయి. అయితే ఆశ్చర్యకరంగా, కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినా కూడా, కొడాలి నానికి ఎలాంటి లీగల్ ఇష్యూలు తలెత్తలేదు. రెడ్ బుక్ దిశగా అధికార పార్టీ దృష్టి కూడా వెళ్లకపోవడం హాట్ టాపిక్‌గా మారింది.కొడాలి నానిని టార్గెట్ చేయకపోవడానికి ఒక కారణం ఆయనకు ఇటీవలే జరిగిన గుండె ఆపరేషన్ అని కొందరు చెబుతున్నారు. ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేసిందా అనే చర్చ రాజుకుంది. పైగా కొడాలి కూడా ఇటీవల మీడియా, రాజకీయ సభలు, సోషల్ మీడియా అన్నీ దూరంగా ఉండి, పూర్తిగా మౌనంగా ఉంటున్నాడు. ఇది తాత్కాలికంగానా? లేక రాజకీయంగా ఓ స్ట్రాటజీనా అన్నదే బిగ్ క్వశ్చన్ !



వైసీపీ హయాంలో టీడీపీని టార్గెట్ చేసిన వల్లభనేని వంశీ, పోసాని కృష్ణ మురళి, వర్నరవీంద్ర, నందిగామ సురేష్ వంటి పలువురు ఇప్పటికే జైలులుకి వెళ్లి  వచ్చారు. కాని కొడాలి మాత్రం ఇప్పటికీ బయటే ఉన్నారు. అంటే ఇది కూటమి రాజకీయలో ఇది "దొంగ - పోలీస్ ఆట" అని టీడీపీ శ్రేణులు సెటైర్లు గుప్పిస్తున్నాయి .. గతంలో బుసలు కొట్టిన తాచుపాము ఇప్పుడు మౌనంతో తప్పించుకుంటోందా?" "తక్కువ అంచనాల్లో ఉన్నవారిని తక్కువగానే తీసుకుంటే.. టైమ్ వస్తే మళ్లీ వాళ్లే పెద్ద టార్గెట్ అవుతారు" అంటూ రాజకీయ నిపుణులు గమనిస్తున్నారు. గుడివాడలో కొడాలికి ప్రజల్లో సానుభూతి లేదు. అయితే ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోంది? "గుండె ఆపరేషన్‌కి కూటమి రాజకీయం బ్రేక్ వేసిందా? లేక స్ట్రాటజీ వేట కోసం వేచిచూస్తుందా ?" కొడాలి కేసు ఇప్పుడు ఏపీలో "చేసింది మరిచిపోతే – మౌనం కవచమయ్యే పాలిటిక్స్" అన్న కొత్త నిర్వచనంగా నిలుస్తుందా? లేక అసలైన రౌండ్ 2 ఇంకా మొదలవలేదా ? ఊహాగానాలకి బ్రేక్ పెట్టే టైం వస్తుందేమో… వేచి చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: