
- ( అమరావతి - ఇండియా హెరాల్డ్ ) . . .
షిర్డీ సాయి, ఇండోసోల్ కంపెనీలకు అక్రమంగా లక్ష కోట్ల విలువైన కాంట్రాక్టులు కేటాయింపు, భూకేటాయింపులపై చాలా అనుమానాలు ఉన్నాయని.. వీటిపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని బీసీవై జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. 2019 ఎన్నికలకు ముందు అసలు షిర్డీ సాయి అనే కంపెనీ గురించి ఎవ్వరికి తెలియదని.. 2019 - 2024 ఐదేళ్ల కాలంలో ఈ కంపెనీకి లక్ష కోట్ల విలువైన కాంట్రాక్టులు కేటాయించారన్న ఆరోపణలు ఉన్నాయని.. దీని వెనక ఉన్న ఏం జరిగిందో ? ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని రామచంద్ర యాదవ్ తన లేఖలో పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఐదేళ్ల పాటు షిర్డీ సాయి లాంటి ఊరూపేరు లేని కంపెనీకి అన్ని కోట్ల విలువైన విద్యుత్ కాంట్రాక్టులు ఎలా ? కేటాయించారో ? ప్రజలకు చెప్పాలన్నారు. ఇక ఆ కంపెనీ నుంచే వచ్చిన ఇండోసోల్ కంపెనీకి భారీగా భూకేటాయింపులు జరిగాయని... ఆ భూ కేటాయింపుల్లో ఏమైనా అక్రమ లావాదేవీలు ఉన్నాయా ? అన్నది కూడా పరిశీలన జరగాలని రామచంద్ర యాదవ్ లేఖలో పేర్కొన్నారు.
కరేడులో రైతులు తమ భూములు అక్రమంగా లాక్కోవద్దని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వం రైతులను పక్కన పెట్టేసి ఈ ఇండోసోల్ కంపెనీకి లొంగిపోవడానికి కారణం ఏమిటో ? తెలియాలన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించడంతో పాటు పూర్తి వాస్తవాలు బయటపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు రామచంద్ర యాదవ్ తన లేఖలో పేర్కొన్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు