నగరి టిడిపి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ వైయస్ఆర్సిపి మాజీమంత్రి రోజాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2000 ఇస్తే ఏం చేయడానికైనా సిద్ధం అంటూ మాజీ మంత్రి రోజా పై గాలి భాను ప్రకాష్ మాట్లాడిన మాటలు వివాదానికి దారి తీసాయి. మరి ఇంతకీ వీరి మధ్య జరిగిన గొడవ ఏంటంటే.. 2024 ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో టిడిపి కూటమి భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి మనకు తెలిసిందే. కూటమిలో భాగంగా టిడిపికి మద్దతు ఉన్నచోట జనసేనకి మద్దతు ఉన్న చోట టిడిపికి మరోచోట బిజెపికి ఇలా సీట్లు కేటాయించిన సంగతి మనకు తెలిసిందే. కానీ కూటమిగా ఏర్పడడంతో సీట్ రాకపోయినా సరే సర్దుకు పోయారు. ఈ విషయం పక్కన పెడితే నగరి ఎమ్మెల్యే సీటు కూటమిలో భాగంగా గాలి భాను ప్రకాష్ కి వచ్చింది. 

అయితే నగరి మాజీ ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి రోజాపై తాజాగా భాను ప్రకాష్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై చాలామంది మహిళలు కూడా మండిపడుతున్నారు. మరి ఇంతకీ ఆయన ఏం మాట్లాడారంటే.. మాజీ మంత్రి రోజా అధికారం ఉందనే అహంకారంతో ఎంతోమందిని చిత్రహింసలు పెట్టడమే కాకుండా అందరినీ మోసం చేసి కోట్లు సంపాదించింది.కోట్లు వెనకేసుకుంది. అంతేకాదు రోజా 2000 ఇస్తే ఏ పని చేయడానికి అయినా సిద్ధం..ఎలాంటి పని అయినా సరే చేసేస్తుంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అయితే గాలి భాను ప్రకాష్ మాట్లాడిన మాటలపై రోజా మండిపడుతూ ఈ గాలి గాడు కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటూ మాట్లాడుతూనే.. మహిళను కించపరిచేలా ఇలా ప్రచారం చేయడం ఏమాత్రం బాగోలేదు. వ్యాంపుకు ఎక్కువ హీరోయిన్ కి తక్కువ అంటూ నా గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అంతేకాదు దీనికి పిచ్చెక్కిందా లేక దీని మాటలు పట్టుకుని వీళ్ళ నాయకుడికి పిచ్చెక్కిందా అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి మాటలు సహించేది లేదు. ఆడవాళ్ళపై ఇలాంటి దారుణాలు జరిగితే ప్రశ్నించినందుకు గాలి భాను ప్రకాష్ ఇలాంటి మాటలు మాట్లాడతారా..వెంటనే చర్యలు తీసుకోవాల్సిందే అంటూ రోజా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది.ప్రస్తుతం గాలి భాను ప్రకాష్, రోజాల పరస్పర వాదనతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: