తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జ్ కోట వినుత తన డ్రైవర్ పిఏ రాయుడుని హత్య చేయించిన కేసులో ఈమెను అరెస్టు చేయడం జరిగింది.. అయితే ఇప్పుడు తాజాగా బెయిల్ మీద బయటకు వచ్చినట్లు సమాచారం. గత నెల 7వ తేదీన రాయుడుని హత్య జరగగా.. చెన్నైలోని ఒక ప్రాంతంలో కాలువలో గుర్తుతెలియని శవాన్ని చెన్నై పోలీసులు సైతం స్వాధీనం చేసుకొని మరి పోస్టుమార్టం చేయగా ఇది హత్య అంటూ గుర్తించారు.. ముఖ్యంగా హత్యకు గురైన రాయుడు చేతి పైన వినుత అని టాటో ఉండడంతో ఆ తర్వాత విచారణలో భాగంగా శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జి వినుత దంపతులపైన విచారించారు.


అనంతరం కోట వినుత దంపతులతో పాటుగా మరో ముగ్గురు అనుచరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.. ఈ కేసులో వినుత భర్త చంద్రబాబు మొదటి ముద్దాయని మూడో నిందితురాలు వినుత అన్నట్లుగా వినిపించాయి.. ఈ కేసులో వినుతకు చెన్నై సెక్షన్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. అలాగే ప్రతిరోజు ఉదయం 10 గంటల లోపు సెవెన్ వెల్స్ పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా సంతకాలు చేయాలని తెలిపారు.


దీంతో ఆమె చెన్నైలోనే ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. కోర్టు చుట్టూ తిరిగి సంతకాలు ప్రతిరోజు కూడా చేయాలని.. కోర్టు వద్దనే వరకు చేస్తూ ఉండాలని ఈ షరతులు అన్నీ కూడా పాటించాల్సిందంటూ వినతకు కోర్టు తెలియజేసింది. ఇప్పటికే ఈ హత్య కేసులో వినుతను జనసేన పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేశారు. తరిచూ ఎక్కువగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనే ఈ దంపతులు ఇలా సడన్గా తమ డ్రైవర్ ను హత్య చేసిన కేసులో ఇరుక్కోవడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక సంచలనంగా మారింది ఈ కేసు. అయితే ఈ విషయం వెనుక టిడిపి ఎమ్మెల్యే ఉన్నారని వినుత దంపతులు ఆరోపణలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: