రాజకీయా నాయకులపై సినిమాలు రావడం అనేది చాలా కాలం నుండే జరుగుతుంది. ఇక రాజకీయ నాయకులపై సినిమాలు పాజిటివ్ గా రావచ్చు ... నెగిటివ్ గా కూడా రావచ్చు. ఇకపోతే గత కొన్ని సంవత్సరాలుగా మాత్రం రాజకీయ నాయకుల పై వచ్చే సినిమాల సంఖ్య చాలా ఎక్కువ శాతం పెరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కీలక రాజకీయ నేతలు అయినటువంటి చంద్రబాబు నాయుడు , వై యస్ రాజశేఖర్ రెడ్డి లపై ఇప్పటికే సినిమాలు వచ్చాయి. రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర 1 , యాత్ర 2 అనే సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఇందులో యాత్ర 1 మూవీ మంచి విజయం అందుకున్న యాత్ర 2 మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ఇప్పటికే చంద్రబాబు నాయుడు గురించి కూడా కొన్ని సినిమాలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పై కూడా ఒక సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఒక ప్రముఖ ఓ టీ టీ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా  జగన్మోహన్ రెడ్డి కి నెగిటివ్ గా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అసలు విషయం లోకి వెళితే ... జగన్మోహన్ రెడ్డి 2019 వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకొని 2019 వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్య మంత్రి గా ఎన్నికైన విషయం మన అందరికి తెలిసిందే. ఇక ఈయన ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగాడు. ఆయన అధికారం లోకి రాక ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా మద్యం ను బ్యాన్ చేస్తాను అని చెప్పి ... ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ను బ్యాన్ చేయలేదు. ఆ పాయింట్ ను బేస్ చేసుకుని నెగటివ్ గా ఓ సినిమాను రూపొందించినట్లు , అది మరికొన్ని రోజుల్లోనే ఓ ఓ టీ టీ లో ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: