
ఆ ఎన్నికల్లో బలరాం ఎమ్మెల్యేగా గెలిస్తే పార్టీ ఓడిపోయింది. దీంతో బలరాం వైసీపీ కండువా కప్పుకున్నారు. 2019 తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం ఓడిపోగానే బలరాం, శిద్ధా ఇద్దరూ వైసీపీ కండువా లు కప్పేసుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు వారి రాజకీయం ముగిసింది. కానీ వారి వారసులు రాజకీయ భవిష్యత్తును బలి పశువును చేసినట్లయ్యింది.
కరణం వెంకటేష్, శిద్ధా సుధీర్ బాబు ఇద్దరూ కూడా పార్టీ యువనేత నారా లోకేష్ కి అత్యంత సన్నిహితంగా మెలిగిన నేతలుగా గుర్తింపు పొందారు. అటువంటి అనుబంధాన్ని వదిలేసి వైసీపీలో చేరారు.
వీరు వైసీపీలో చేరినా 2019 తర్వాత ఎలాంటి ప్రాధాన్యం లేదు. ఇక శిద్దా రాఘవరావు కి అత్యంత ప్రాధాన్యం కలిగిన మంత్రిత్వ శాఖలను 2014-2019 మధ్య బాబు గారు ఇచ్చారు. టిడిపిలో పాలిటిబ్యూరో సభ్యుడిగా ఎంతో గౌరవం పొందారు. కానీ పార్టీకి కేవలం 23 సీట్లు వచ్చిన వెంటనే, ఇక భవిష్యత్తులో టిడిపి గెలవదన్నట్టు పార్టీని వదిలేశారు. అయినా వీరి అదృష్టం బాగుండి, 2024 దర్శి ఎమ్మెల్యే టికెట్‌ను బాబు గారు ఆఫర్ చేశారు. కానీ దాన్ని చేజేతులా శిద్దా సుధీర్ ఓ సెఫాలజిస్ట్ మాయలో పడి చేజేతులా తన రాజకీయ భవిష్యత్తు నాశనం చేసుకున్నట్టు టాక్ ? ఇక ఇప్పుడేమో ఎప్పుడెప్పుడు టిడిపిలోకి తిరిగి వెళ్లాలా అని తహతహలాడుతున్నారట. ఏదేమైనా కరణం, శిద్ధాలు వేసిన పొలిటికల్ రాంగ్ స్టెప్పులతో వారి వారసుల కెరీర్ ఇబ్బందుల్లో పడింది.