ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే పేరు మారు మ్రోగిపోతుంది ..అదే రితిక నాయక్. ఈ పేరు గురించి నిన్న మొన్నటి వరకు చాలా మందికి పెద్దగా తెలియదు. కానీ, మీరాయి సినిమా విడుదలైన తర్వాత రితిక నాయక్ పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వినిపించసాగింది. ఈ సినిమాలో ఆమె నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా యువత సోషల్ మీడియాలో రితిక పేరునే జపిస్తూ, ఆమె ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.  పలు సినిమాలలో హీరోయిన్గా మెరిసిన రితిక నాయక్ ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాకుండా మొత్తం భారత సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. తెలుగులో ఆమె గురించి ఇప్పటివరకు చాలా మందికి తెలిసిన వారు తక్కువే. 1997 అక్టోబర్ 27న జన్మించిన రితిక చదువులో డిగ్రీ పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచే నటన పట్ల ఉన్న ఆసక్తి ఆమెను ఫ్యాషన్, మోడలింగ్ వైపు నడిపింది. మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించిన రితిక, 2019లో జరిగిన డెళి Fరెష్ Fఅచె ఛొంతెస్త్లో టైటిల్ గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే ఆమె సినీ ప్రయాణానికి పెద్ద మలుపు అయింది.


2022లో విశ్వక్సేన్ హీరోగా నటించిన "అశోకవనంలో అర్జున కళ్యాణం" చిత్రంతో రితిక వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినా, పెద్దగా క్రేజ్‌ను అందుకోలేకపోయింది. నాని హీరోగా నటించిన "హాయ్ నాన్న" సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో కనిపించింది. కానీ అప్పటికీ పెద్దగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయింది. అయితే "మీరాయి" సినిమా ఆమె కెరీర్‌లో గేమ్ ఛేంజర్‌గా మారింది. ఈ సినిమాలో ఆమె అందం, నటన, సొగసైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఫలితంగా రితిక ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా మారి, ఇండస్ట్రీలోని ప్రముఖ ఫిల్మ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించింది.



ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం, రితిక నాయక్ పాన్-ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ తదుపరి సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిందట. విజయ్ దేవరకొండ లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న హీరో సినిమాల్లో నటించే అవకాశం రావడం అంటే చాలా పెద్ద విషయం. అది కొత్త హీరోయిన్లకు సాధ్యంకానిది. కానీ రితిక తన ప్రతిభతో, మీరాయి సినిమా విజయంతో అది అవలీలగా సాధించింది. ఇప్పుడు రితిక నాయక్ పేరు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి నోటా మారు మ్రోగిపోతోంది. టాలీవుడ్‌లో కొత్త స్టార్ హీరోయిన్ పుట్టిందని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నారు. తక్కువ సమయంలోనే పలు అడ్డంకులు దాటి పాన్-ఇండియా స్థాయిలో అవకాశాలు సొంతం చేసుకోవడం రితిక కెరీర్‌లో విశేషం. భవిష్యత్తులో ఆమె మరింత ఉన్నత స్థాయికి చేరి, పెద్ద స్టార్ హీరోల సరసన వరుసగా సినిమాలు చేయడం ఖాయం అని ఫిల్మ్ నగర్ టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: