ఏంటి తేజ సజ్జా మిరాయ్ మూవీ నానిని నిద్రపోనివ్వడం లేదా.. మిరాయ్ సినిమా చూసి నానికి అసలు నిద్ర కూడా పట్టడం లేదా..నాని మీద రూమర్స్ రావడానికి ప్రధాన కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ వహించిన మిరాయ్ మూవీలో తేజ హీరోగా చేసి హీరోగా మరో మెట్టు ఎక్కారు. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారి మిరాయ్ సినిమాతో మరో హిట్ సాధించారు. అయితే  ఈ సినిమా రెండు రోజులకే భారీ కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నా కూడా ఇండస్ట్రీ నుండి ఏ హీరోలు కూడా ఈయనకు సపోర్టుగా నిలవడం లేదు. ఒక పేరున్న హీరో కొడుకు లేదా పేరున్న హీరో సినిమా విడుదలైతే మిగిలిన హీరోలందరూ సినిమా బాగుంది ఎక్సలెంట్ అంటూ రివ్యూ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు.

 కానీ తేజ చేసిన మిరాయ్ మూవీ అంత పెద్ద హిట్ అయినా కూడా ఎవరు సపోర్ట్ ఇవ్వడం లేదు.అయితే అర్ధరాత్రి పూట నాని పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఏముందంటే..కంగ్రాట్స్ రా తేజ.. నీ కష్టం,నమ్మకం, సహనం ఫలించింది.. మంచు మనోజ్ బాబాయ్ నిన్ను చూస్తే చాలా గర్వంగా సంతోషంగా ఉంది. ఆలస్యమైన సరే నీకు రావాల్సిన విజయమే ఇది. డియర్ కార్తీక్ నువ్వు సాధించిన విధానం చూస్తే నాక చాలా గర్వంగా ఉంది. ఫైనల్ గా సాధించేసావ్. యాక్షన్ కొరియోగ్రఫీ, మ్యూజిక్ గురించి స్పెషల్ గా చెప్పుకోవాల్సిందే. నిర్మాత విశ్వప్రసాద్ తో పాటు టీమ్ అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే విజయం దక్కినందుకు చాలా సంతోషం అభినందనలు అంటూ ట్వీట్ పెట్టారు.

 అయితే ఈ ట్వీట్ ఏకంగా  శనివారం అర్ధరాత్రి 12:22 నిమిషాలకు నాని పెట్టడంతో ప్రస్తుతం ఈ ట్వీట్ పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఈ ట్వీట్ చూసిన కొంతమంది నెటిజెన్లు నాని పై ఫన్నీగా రియాక్ట్ అవుతూ కామెంట్లు పెడుతున్నారు.ఏంటి నాని నిద్ర పట్టడం లేదా.. చిన్న హీరో అంత పెద్ద హిట్ ఎలా కొట్టాడు అనుకుంటున్నావా అంటున్నారు. అయితే ఈ కామెంట్స్ పెట్టడానికి కారణం మిరాయ్ మూవీలో మొదట హీరోగా నానిని అనుకున్నారట.కానీ చివరికి వచ్చేసరికి రెమ్యూనరేషన్ తక్కువైందని నాని రిజెక్ట్ చేశారట. అలా నానికి దక్కాల్సిన క్రెడిట్ తేజ సజ్జాకి దక్కడంతో నానికి నిద్ర పట్టడం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: