ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 1000 ఆలయాలను నిర్మించాలని టీటీడీ ధర్మకర్తల మండలిలో నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో అసెంబ్లీ స్థానంలో ఆరు ఆలయాల వరకు నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించడం జరిగింది. మతమార్పిడుల కట్టడి కోసం శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఆలయాలను నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ అన్నారు.

ప్రధానంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల గురించి చర్చలు జరిగాయని చెప్పిన ఆయన తొలిసారిగా బ్రహ్మోత్సవాలను ఇస్రో పరిశీలించనుందని చెప్పుకొచ్చారు. ఈ నెల 23వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని  24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు బ్రహ్మోత్సవాల నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని  బీఆర్ నాయుడు కామెంట్లు చేశారు.

ఈ నెల 24వ తేదీన మీన లగ్నంలో ధ్వజారోహణం,  అనంతరం ఎపి సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. పది రోజుల పాటు సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయబోతున్నామని  వెల్లడించారు. ఈ నెల 28వ తేదీన శ్రీవారి గరుడ సేవకు 3 లక్షల కంటే ఎక్కువమంది వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పుకొచ్చారు.

చిన్నపిల్లలు తప్పిపోకుండా జియో ట్యాగింగ్ విధానం అమలు చేయబోతున్నామని పేర్కొన్నారు.  అంతకుముందే ఈవో అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులతో కలిసి శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్ లెట్ ను విడుదల చేశారు. టీటీడీ తీసుకున్న నిర్ణయాలపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

ttd