
దీంతో మెట్రో రైలు నిర్వహణ నుంచి L&T తప్పుకుంది.. ఈ మొదటి దశ ప్రాజెక్టుకు తెలంగాణ సర్కార్ కొనుగోలు చేయడంతో L&T ను అప్పుల నుంచి బయట పడేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వమే మెట్రో ప్రాజెక్టు నడిపేందుకు ఇటీవలే అధికారులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవ్వడమే కాకుండా ఇరువురి మధ్య కూడా అంగీకారాన్ని కుదుర్చుకున్నారట. ఇప్పటివరకు L&T సంస్థకు రూ .13 వేల కోట్ల రూపాయల అప్పును ప్రభుత్వం తీర్చడానికి ఓకే చెప్పినట్లు వినిపిస్తున్నాయి. అలా మొదటి విడత కింద L&T సంస్థకు రూ. 2,100 కోట్ల రూపాయలు డబ్బులు చెల్లించేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధమయ్యింది.
హైదరాబాద్ మెట్రో మొదటి దశ 69.k. m ను ప్రైవేటు భాగస్వామితో కలిపి 22 వేల కోట్లతో నిర్మించారు. అయితే మెట్రో వల్ల భారీ నష్టాలు వచ్చాయని దీంతో ఈ మెట్రోని నడపడం తమ వల్ల కాదంటూ L&T సంస్థ చేతులెత్తేయడంతో ఈ మేరకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లేఖలు రాసిన బకాయిలు చెల్లించకపోవడంతో ఆర్థిక భారం పెరిగిపోయిందని L&T సంస్థ ఒక లేఖ ద్వారా తెలిపారు. ఈ మేరకు కనీసం ఇప్పటికి రూ. 2,500 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వానికి లేఖ రాసిన ఎలాంటి స్పందన లేదని L&T ఆవేదన వ్యక్తం చేసింది.. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి, L&T సంస్థ తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనివల్లే మెట్రో రైల్ నిర్వహణ నుంచి L&T తప్పుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రెండవ దశలోని 2A, 2B వంటి ప్రాజెక్టులలో భాగస్వామిగా చేరడం కూడా సాధ్యం కాదంటూ L&T సంస్థ ఎండి ఎస్వి సుబ్రహ్మణ్యం సీఎం రేవంత్ రెడ్డి తో క్లారిటీగా చెప్పేశారట.
అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మొదటి దశ రెండో దశ మధ్య కు సంబంధించి రెవెన్యూ, ఇంటిగ్రేషన్, కాస్ట్ షేరింగ్ కోసమైనా ఒప్పందం కుదుర్చుకోవాలని కోరిన.. L &T ఎండి ఒప్పుకోలేదట. దీంతో తాము పూర్తిగా రవాణా కార్యకలాపాల నిర్వహణ రంగం నుంచి బయటికి రావాలని నిర్ణయం తీసుకున్నామంటూ తెలిపారట. తమ సంస్థకు ఉన్న అప్పులను చెల్లిస్తే మొదటి దశ ప్రాజెక్టును ప్రభుత్వానికి అప్పగించడానికి తామసిద్దంగానే ఉన్నామంటూ తెలియజేశారు.2014లో హైదరాబాద్ మెట్రో రైలు పొడవు పరంగా రెండవ స్థానంలో ఉండగా ప్రస్తుతం 9వ స్థానానికి పడిపోయింది.. పలు నగరాలలో మెట్రోను విస్తరించినప్పటికీ హైదరాబాదులో మాత్రం సాధ్యం కాలేదు.. దీనివల్ల ఫేజ్ 2A,2B వంటి విస్తరణ కింద 8 లైన్లకు సంబంధించి..163K.M పొడవైన మెట్రో నెట్వర్క చిక్కులు ఎదురవుతున్నాయి.