ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యం సృష్టించిన సంచలనంపై నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా నిరసన చేపట్టారు. నకిలీ మద్యం తయారీని ఖండిస్తూ నగరి ఎక్సైజ్ కార్యాలయం వరకు ఆమె నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై, ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై రోజా తీవ్ర విమర్శలు చేశారు.

గత ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ మద్యం ప్రియుల పొట్ట కొడతారా అంటూ ఉగిపోయారని గుర్తుచేస్తూ రోజా వ్యాఖ్యానించారు. "ఈరోజు మద్యపాన ప్రియుల పొట్ట కాదని, వాళ్ళ ప్రాణాలనే హరీమని చంద్రబాబు తీస్తున్నారు" అని ఆమె ఘాటుగా పేర్కొన్నారు.

నకిలీ మద్యం కారణంగా ప్రజల ప్రాణాలు పోతున్నా, పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని రోజా నిలదీశారు. కల్తీ మద్యంపై జరుగుతున్న మరణాలపై పవన్ కళ్యాణ్ మౌనం వహించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతున్న సమయంలో జనసేన నేతగా ఆయన ప్రశ్నించకపోవడం సరికాదని రోజా దుయ్యబట్టారు. రాష్ట్రంలో నకిలీ మద్యం సమస్య తీవ్రతను, దీనిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని రోజా ఈ సందర్భంగా  పరోక్షంగా కామెంట్లు  వ్యక్తమవుతున్నాయి.

రోజా చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.  రోజా ప్రస్తుతం సినిమాలకు కూడా దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.  రోజా కెరీర్ విషయంలో  ఎలాంటి ప్లాన్స్  తో ముందుకెళ్తారో చూడాల్సి ఉంది.  రోజా 2029సంవత్సరంలో  ఎలాంటి ప్రాజెక్ట్ తో  ముందుకెళ్తారో చూడాల్సి ఉంది.

రోజా పలు టీవీ షోలలో కనిపిస్తూ సందడి చేస్తున్నారు.  రోజా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ  చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.  రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తే రోజాకు మళ్ళీ మంత్రి పదవి దక్కే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.  రోజా విమర్శలకు ఛాన్స్ ఇవ్వకుండా  వ్యవహరించాలని  కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.  గతంలో రోజా  చేసిన విమర్శల విషయంలో కొన్ని నెగిటివ్ కామెంట్స్ వినిపించిన సంగతి తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: