
ఈ నేపథ్యంలోనే బిజెపి పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరపు నుంచి ప్రచారం చేసేందుకు సుమారుగా 40 మందితో కూడిన ప్రముఖుల జాబితాను బిజెపి ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ విడుదల చేశారు. అయితే ఈ జాబితాలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఈటెల రాజేందర్ , రఘునందన రావు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తో పాటుగా మరికొంతమంది ప్రముఖులు ఉన్నారు. అందుకు సంబంధించి ఒక లిస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అయితే ఇంతమంది పాల్గొనడం అనేది ఒక స్పెషల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రత్యర్థుల పార్టీకి తాము ఐక్యంగా ఉన్నామనే సంకేతాన్ని ఇతర పార్టీలకు తెలియజేసేలా చేస్తున్నట్టు కనిపిస్తోంది.
ఇలాంటి సందర్భంలోనే బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో పోల్చుకుంటే బిజెపి పార్టీలో స్ట్రాంగ్ గా మేమందరం ముందుకు వెళ్తున్నామనేటువంటి సంకేతాన్ని ఇచ్చినట్టు కనిపిస్తోంది. అలాగే మరొకవైపు కాంగ్రెస్ పార్టీలో అప్పుడే ఘర్షణల వాతావరణం నెలకొన్నట్లుగా వినిపిస్తున్నాయి. బూత్ కమిటీల విషయంలో జూబ్లీహిల్స్ రహమత్ నగర్ డివిజన్లలో కాంగ్రెస్ నాయకులు నెట్టుకొని కొట్టుకున్నారంటూ ఒకపక్క ప్రచారం జరుగుతోంది. రెండు వర్గాలుగా విడిపోయి మరి ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకున్న సంఘటనతో గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఇందులో నవీన్ యాదవ్ బ్యాచ్, భవాని శంకర్ బ్యాచ్ మధ్య ఆదిపత్య పోరాటం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది.ఈ విషయం బిఆర్ఎస్ పార్టీకి ఆనందాన్ని కలిగిస్తోంది.