
అయితే ఆ ఫోటోల్లో సీనియర్ హీరోలందరూ కనిపించినా, బాలకృష్ణ మాత్రం లేరు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమైంది. “సీనియర్ హీరోలు అంటే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలయ్య – ఈ నలుగురూ కదా? అయితే బాలయ్యను ఎందుకు పిలవలేదు?” అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది “చిరంజీవి–బాలయ్య మధ్య పాత మనస్పర్థలు ఉన్నాయనే విషయం తెలిసిందే.. అందుకే కావచ్చు ఆయనను ఆహ్వానించకపోయుండచ్చు” అని అంటుంటే, మరికొందరు మాత్రం “ఇండస్ట్రీలో పెద్దలుగా ఉన్న వారందరినీ సమానంగా పిలవాలి, ఒకరిని పిలిచి ఒకరిని పిలవకపోవడం సరైన విధానం కాదు” అంటూ అభిప్రాయపడుతున్నారు. ఇక కొందరు ఫ్యాన్స్ మాత్రం “చిరంజీవి పెద్ద మనసుతో చేసిన వేడుకను ఇలా నెగటివ్‌గా చూపించడం సరైంది కాదు, బాలయ్య కూడా ఉండి ఉంటే ఈ ఫోటోలు మరింత అందంగా కనిపించేవి, కానీ ఇంత రాధాంతం జరగేది కాదు” అని చెబుతున్నారు.
ఇలా ప్రస్తుతం సోషల్ మీడియా అంతా చిరంజీవి దీపావళి పార్టీ ఫోటోలతో రచ్చ రంబోలా అయిపోతుంది. ఫ్యాన్స్, సినీప్రేమికులు, నెటిజన్లు – అందరూ ఒక్కటే టాపిక్ మీద మాట్లాడుతున్నారు. “చిరంజీవి దీపావళి పార్టీ – బాలయ్య ఎక్కడ?” అనే ప్రశ్న ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇలా చూస్తుంటే, చిరంజీవి పెట్టిన ఒక ఫ్యామిలీ పార్టీ కూడా ఇప్పుడు రాజకీయాల మాదిరిగా పెద్ద చర్చకు దారితీస్తోంది. సోషల్ మీడియా యుగంలో ఒక ఫోటో, ఒక పోస్ట్, ఒక గిఫ్ట్ కూడా ఎంత పెద్ద హీట్ క్రియేట్ చేయగలదో దీని ద్వారా మరోసారి రుజువయింది.