
ఇన్వెస్టర్లు అధికంగా బంగారం కొనడం , అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాలర్లు వదిలేసి బంగారాన్ని అధికంగా కొనుగోలు చేస్తోంది. దీంతో బంగారం ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ఇక వెండి కూడా అదే స్థాయిలో పెరిగింది. చాలామంది నిపుణులు కూడా వెండి రూ .2 లక్షల రూపాయల వరకు వెళుతుందని చెప్పడంతో వాటిని కూడా విపరీతంగా కొనేశారు. ముఖ్యంగా బంగారం నగలు కొనడం కంటే బిస్కెట్లు రూపంలో కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడింది. అలాగే వెండి వంటి వాటిని కూడా బిస్కెట్ రూపంలోనే కొనుగోలు చేస్తున్నారు.
అయితే దీపావళి తర్వాత బంగారం ధరలు తగ్గుతాయని నిపుణులు గత కొద్దిరోజులుగా చెబుతూనే ఉన్నారు. అన్నట్టుగానే ఇప్పుడు తాజాగా రూ.6000 రూపాయల వరకు తగ్గినట్లు తెలుస్తోంది. 22 క్యారెట్లు బంగారం ధర రూ .1,17,500 కాగా ,24 క్యారెట్ల బంగారం ధర రూ 1,28,150 రూపాయలకు చేరింది. అదే సందర్భంలో వెండి ధర రూ.1,85,000 నుండి రూ .1,65 ,000 వేల రూపాయలకు పడిపోయింది. దీంతో వెండి ధర కూడా ఏకంగా రూ .20 వేల రూపాయల వరకు తగ్గడం గమనార్హం.