
కాంతార చాప్టర్ 1 చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఈ సినిమా 750 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించి సంచలనం సృష్టించింది. కేవలం దేశీయంగానే కాక అంతర్జాతీయ ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ విజయ పరంపరను మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేకర్స్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంతార చాప్టర్ 1 చిత్రాన్ని ఇంగ్లీష్ వెర్షన్‌లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 31వ తేదీన కాంతార చాప్టర్ 1 ఇంగ్లీష్ వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ విధంగా ఇంగ్లీష్‌లో విడుదల చేయడం ద్వారా సినిమాకు అంతర్జాతీయంగా రీచ్ పెరుగుతుందని, హాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవచ్చని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. హాలీవుడ్ వెర్షన్‌గా విడుదల కానున్న ఈ సినిమా నిడివి 2 గంటల 14 నిమిషాలుగా ఉండనుంది. ఇది సినిమాకు మరింత మంది వీక్షకులను చేరువ చేస్తుందని మేకర్స్ ఆశిస్తున్నారు. కాంతార చాప్టర్ 1 గ్లోబల్ స్థాయిలో ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ఈ విధంగా ఇంగ్లీష్‌లో విడుదల చేయడం ద్వారా సినిమాకు అంతర్జాతీయంగా రీచ్ పెరుగుతుందని, ముఖ్యంగా నార్త్ అమెరికన్, యూరోపియన్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవచ్చని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. హాలీవుడ్ సినిమా ప్రియులను దృష్టిలో ఉంచుకుని, ఈ వెర్షన్‌ను 2 గంటల 14 నిమిషాల నిడివితో విడుదల చేయనున్నారు. కథలోని మూల స్ఫూర్తి చెక్కుచెదరకుండా, అంతర్జాతీయ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా దీనిని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.
ఈ గ్లోబల్ రిలీజ్ ద్వారా కాంతార చాప్టర్ 1 చిత్రం మరిన్ని రికార్డులు సృష్టిస్తుందని, భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ వేదికపై మరింతగా నిలబెడుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. రిషబ్ శెట్టి భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కూడా రికార్డులు క్రియేట్ చేయాలనీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.