తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్.. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా హైదరాబాదే రాజధానిగా ఉండేది. ఈ విధంగా హైదరాబాద్ ఎంతో డెవలప్ అయింది.. పేదవారి నుంచి మొదలు కోట్లున్న ధనికుల వరకు ఇక్కడే నివసిస్తూ ఉంటారు. పని కోసం వెళ్ళిన ప్రతి ఒక్కరిని అక్కున చేర్చుకొని ఉపాధి కల్పించే గొప్ప నగరం హైదరాబాద్. అలాంటి హైదరాబాదులో చాలామంది కాయా కష్టం చేసి ఇండ్ల స్థలాలు కొనుక్కుంటూ ఉంటారు. అయితే ఆ మధ్యకాలంలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు గవర్నమెంట్ భూములను ఆక్రమించి వాటిని ఫ్లాట్లుగా మార్చి పేదలకు విక్రయించారు. ఈ విషయం తెలియని ఎంతోమంది పేదలు ఆ భూములను కొనుగోలు చేసి చివరికి మోసపోయారు. ఇక ప్రభుత్వ భూములు విపరీతంగా అన్యాక్రాంతం అవ్వడంతో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో ఒక స్కీం తీసుకొచ్చింది. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారి భరతం పట్టి వారు కట్టిన లేఔట్ లు అన్నింటిని కూల్చేసింది. 

అలా హైడ్రా హైదరాబాదులో ప్రభుత్వ భూములు చెరువులు కుంటలను కాపాడింది.. ఎప్పుడైతే హైడ్రా తన పని మొదలుపెట్టిందో అప్పుడే రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది తీవ్రంగా పడిపోయింది. గత సంవత్సర కాలం నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు లేక అందరు సతమతమవుతున్నారు. అలాంటి ఈ తరుణంలో తాజాగా రియల్ ఎస్టేట్ పుంజుకుందని ఒక సర్వే తెలియజేసింది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. ఈ ఏడాది జులై నుంచి సెప్టెంబర్ మధ్యలో హైదరాబాదులో  ఫ్లాట్లు, ఇండ్లు కలిపి  17,608 అమ్ముడయ్యాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ బయట పెట్టింది. పోయిన ఏడాది ఇదే సమయంలో 11,564 ఫ్లాట్లు, ఇండ్లు అమ్ముడు అయితే ఈ ఏడాది పెరిగాయని తెలియజేశారు. 53% రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్ లో పుంజుకుందని తెలియజేశారు. ఈ విధంగా హైదరాబాద్,బెంగుళూరు, చెన్నై కలిపి ఇండ్ల విక్రయాలు  47% పెరిగాయని అన్నారు.

38,644  ఎక్కువగా అమ్ముడు అయ్యాయని,పోయిన ఏడాది ఇదే కాలంలో  24,284  విక్రయాలు ఉన్నాయని తెలియజేశారు. ముఖ్యంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో 95,547 ఫ్లాట్లు  అమ్ముడు అయ్యాయి. పోయిన ఏడాదితో పోలిస్తే ఈసారి కాస్త తగ్గినట్టే కనిపిస్తోంది. టోటల్ గా గమనిస్తే మాత్రం దక్షిణాదిలోనే ఈ ఏడాది రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్ లో పుంజుకుందని తెలియజేశారు. మరీ ముఖ్యంగా హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారం లాభాల్లో ముందుకు వెళుతుందని సర్వే సంస్థ తెలియజేసింది.  ఇందులో హైదరాబాదులో 17,658, బెంగళూరులో 11 124 పెరిగాయి. చెన్నైలో మూడువేల నుంచి ఏకంగా 7000 వరకు పెరిగిపోయాయి. కోల్ కత్తాలో 2700 నుంచి 3800 వరకు పెరిగాయి. ఇక ఢిల్లీలో దాదాపు పదివేల  అమ్మకాలు పోయిన ఏడాది ఉంటే ఈసారి 7000 పడిపోయినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: